చీకటిలో వెలుగులా నన్ను నడిపిస్తున్న నాన్నా.. మీరిచ్చిన ధైర్యంతోనే.. వైఎస్ షర్మిల ఉద్వేగం!!
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు వైయస్ కుటుంబం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి, వైయస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఆయన అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

వైఎస్ఆర్ సమాధి వద్ద అన్న జగన్ తో పాటు నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల
ఇక ఈరోజు ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఒకే చోట కనిపించారు. తండ్రి సమాధి వద్ద కలిసే నివాళులర్పించారు. తల్లి విజయమ్మతో పాటు షర్మిల తన కుమార్తె కుమారుడితో కలిసి అన్న జగన్ తో పాటే నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మాటలు లేని సమయంలో ఇద్దరూ వైఎస్ సమాధి వద్ద ఒకేసారి కనిపించటం ఆసక్తికరంగా మారింది.
వైఎస్ ఆశయాల సాధన కోసం పోరాటం సాగిస్తున్నా అంటూ షర్మిల ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ వైయస్ షర్మిల తో సీఎం జగన్మోహన్ రెడ్డి విభేదించారు . అప్పటి నుంచి అన్నాచెల్లెళ్ల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇక వైయస్ షర్మిలకు తాను చేస్తున్న రాజకీయ పోరాటంలో ఆమె తల్లి విజయమ్మ అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో విజయమ్మ కూడా అటు వైయస్ జగన్, షర్మిల మధ్య తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు వైయస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళి అర్పించిన తర్వాత వైయస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. వైఎస్ ఆశయాల సాధన కోసం తాను సాగిస్తున్న పోరాటంలో తన తండ్రి అండగా నిలుస్తున్నాడని వైయస్ షర్మిల ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు.
తండ్రిని గుర్తుచేసుకొని ఉద్వేగానికి లోనైన షర్మిల.. నన్ను నడిపిస్తున్న నాన్నా .. అంటూ ట్వీట్
తన తండ్రి తనకు అన్ని వేళలా అండగా ఉన్నాడని, తనకు స్ఫూర్తినిస్తూ ముందుకు నడిపిస్తున్నాడని, తనలో ప్రజలు వైయస్ రాజశేఖర్ రెడ్డి ని చూస్తున్నారని వైయస్ షర్మిల ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. తండ్రి 73వ జయంతి సందర్భంగా తండ్రిని గుర్తుచేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. ఎండలో నీడగా, వానలో జల్లులా, చీకటిలో వెలుగులా, పగటి పూట ఆలోచనగా, కష్టాల్లో అండగా, నా పోరులో ఆయుధంగా, నాకు స్ఫూర్తినిస్తూ నన్ను నడిపిస్తున్న నాన్నా.. మీరు చూపిన ప్రేమ, మీరిచ్చిన ధైర్యం నన్ను నడిపిస్తోందని వైయస్ షర్మిల పేర్కొన్నారు. నాలో మిమ్మల్ని చూస్తున్న జనం అనుక్షణం మిమ్మల్ని గుర్తుచేస్తూనే ఉంటారంటూ వైయస్ షర్మిల ట్వీట్ చేశారు.

చీకటిలో వెలుగులా తండ్రి తనను నడిపిస్తున్నారన్న షర్మిల
తన తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయాలలో ముందుకు వెళుతున్న వైయస్ షర్మిల, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో విభేదించి పార్టీ పెట్టడంతో అన్న జగన్మోహన్ రెడ్డి సహకారం కూడా షర్మిలకు లభించటం లేదు. ఒంటరిగా పోరాటం చేస్తున్న వైయస్ షర్మిల తండ్రి ఆశయాలతో ముందుకు వెళుతూ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు వణుకు పుట్టిస్తున్నారు. చీకటిలో వెలుగులా తండ్రి తనను నడిపిస్తున్నారు అంటూ, ఆ ధైర్యమే తనకు ఆయుధంగా ముందుకు సాగుతున్నాను అంటూ వైయస్ షర్మిల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications