• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గులాబీ పై గుస్సా: నాడు నెత్తిన పెట్టుకున్న ఉద్యోగస్తులు నేడు ఎందుకలా..?

|

తెలంగాణ ఎన్నికల వేళ ఆపద్ధర్మ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవా... తెలంగాణ ఉద్యోగ సంఘాలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా గళం విప్పబోతున్నాయా.. అసలు తెలంగాణ ఉద్యమంలోనే కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాలు కేసీఆర్ వైఖరిపై ఎందుకు అసంతృప్తితో ఉన్నాయి... ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్న ఉద్యోగ ఉపాధ్యాయుల ధర్మాగ్రహ సభలో ఏమని తీర్మానం చేయబోతున్నారు...

 కీలక సమయంలో ప్రభుత్వం పై ఉద్యోగుల కన్నెర్ర

కీలక సమయంలో ప్రభుత్వం పై ఉద్యోగుల కన్నెర్ర

తెలంగాణ ఉద్యమంలో నాడు కీలకంగా వ్యవహరించారు ఉద్యోగులు. తామంతా కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చారు. ఇప్పుడు అదే ఉద్యోగులు కేసీఆర్ సర్కార్‌పై కన్నెర్ర చేశారు. తమను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పింఛన్‌దారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే అసంతృప్తి రేపు కేసీఆర్‌ పదవికి ఎసరు పెట్టే అవకాశం ఉందని పలువురు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. సర్కార్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం హైదరాబాద్‌లో ధర్మాగ్రహ సభను నిర్వహించనున్నాయి. ఈ సభ నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

చర్చలు జరిపి పరిష్కరించని సమస్యలు

చర్చలు జరిపి పరిష్కరించని సమస్యలు

ఈ ఏడాది మే 16న రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులను ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు పిలిపించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ సర్కార్ ఉన్న పాఠశాలలను మూసివేయిస్తోందని ధ్వజమెత్తారు. గురుకులాల్లో 3 లక్షల నుంచి 4 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే సర్కార్ విద్యనందిస్తోందని తెలిపిన ఉద్యోగ సంఘాలు రాష్ట్రంలోని మిగతా 60 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించాయి.

ధర్మాగ్రహ సభలో ప్రధాన డిమాండ్లు ఇవే

ధర్మాగ్రహ సభలో ప్రధాన డిమాండ్లు ఇవే

ఆదివారం జరిగే సభకు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి 72 సంఘాలు మద్దతు పలికాయి. ఒకప్పుడు ఉద్యోగ సంఘాల నేతలంతా ఒక్కటిగా ఉన్నప్పటికీ ఇప్పుడు వారి మధ్య విభేదాలు తలెత్తాయి. కొందరు కేసీఆర్‌కు మద్దతుగా నిలువగా మరికొందరు ఆయన్ను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఆదివారం జరగనున్న ధర్మాగ్రహ సభలో పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచనున్నాయి .ఈ డిమాండ్లను సభలో చర్చించి తీర్మానం చేయనున్నారు.

* ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి
* సీఎం హామీ మేరకు ఈ ఏడాది జూన్‌ 2 నుంచి 43% ఐఆర్‌ ఇవ్వాలి
* పీఆర్సీ నివేదికను సత్వరమే తెప్పించుకుని అమలు చేయాలి
* అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు వేతన స్థిరీకరణను అమలు చేయాలి
* పెన్షనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి
*ఉపాధ్యాయులకు సర్వీసురూల్స్‌ అమలు చేయాలి
*ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులందరినీ వెనక్కి రప్పించాలి
*అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటు
*70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్ ఇవ్వాలి
* ఈహెచ్‌ఎస్‌ ద్వారా నగదు రహిత వైద్యం
* భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల అప్‌గ్రెడేషన్
* అంతర్‌ జిల్లా బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలిరువురూ ఒకేచోట పనిచేసే వెసులుబాటు కల్పించాలి
*ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఆన్‌డ్యూటీపై ఉన్నత విద్యార్హతకు అవకాశం
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లకు ఓటింగ్‌ అవకాశం
* ఉద్యోగులందరికీ సొంత ఇళ్లు తదితర డిమాండ్లపై సభలో చర్చించి తీర్మానం చేయనున్నారు.

అసలే ఎన్నికల సమయం కావడంతో ఇలా ఉద్యోగ సంఘాలు టీఆర్ఎస్ పై కన్నెర్ర చేయడంతో గులాబీ నేతల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ రావడంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు గులాబీ పార్టీపై గుస్సా అవడంతో ఆ పార్టీ వర్గాల్లో గుబులు పుడుతోంది.

lok-sabha-home

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a jolt to TRS all the government employees and teachers association had called for a protest on Sunday where they would be protesting against the TRS govt for neglecting them and not having fullfilled their promises. The employees and teacher association will be discussing on the issues and will pass a resolution, according to sources.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more