హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక కరోనా అంతమే!: చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆదివారం ఉదయం ఒక అద్భుతం జరిగింది. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన అర్చకుడు సురేష్ మహరాజ్.. స్వామివారి సన్నిధిలో కూర్మ మూర్తి(తాబేలు) ఉండటాన్ని చూసి వెంటనే ప్రధాన అర్చకులు రంగరాజన్‌కు తెలిపారు.

ఏ దారి లేకున్నా.. ఆలయంలో కూర్మమూర్తి ప్రత్యక్షం..

ఏ దారి లేకున్నా.. ఆలయంలో కూర్మమూర్తి ప్రత్యక్షం..

ఆయాలనికి వచ్చిన ప్రధాన అర్చకులు ఆ తాబేలును చూసి ఆశ్చర్యపోయారు. దేవాలయంలోకి కూర్మ మూర్తి(తాబేలు) లోపలికి ప్రవేశించడానికి ఎలాంటి దారీ లేదని, అయినా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని రంగరాజన్ చెప్పారు. ఈ కూర్మమూర్తి ఆలయ ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తోందని అన్నారు.

అమృతం లభించినట్లే.. ఇక కరోనా అంతమే..

అమృతం లభించినట్లే.. ఇక కరోనా అంతమే..

కూర్మావతారం ఉద్దేశం క్షీరసాగర మథనం, పూర్వం అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మరూపంలో వచ్చిన మహా విష్ణువుపైనే మేరు పర్వతాన్ని కవ్వంగా ఉంచి వాసుకి సాయంతో ఒక దేవతలు, మరోవైపు అసురులు మదించారు.ఇప్పటి కూడా కరోనా ఔషధం కోసం ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. సాగర మథనంలో హాలహలం వచ్చింది.. దానిని పరమశివుడు స్వీకరించాడు. అలాగే కరోనా నుంచి మనకు తొందరగా విముక్తి లభించబోతోందన్నారు. మనకు అమృతం(కరోనా ఔషధం) దొరకబోతోందనేది సారాంశమని, ఇది అందరికీ శుభవార్తేనని రంగరాజన్ వ్యాఖ్యానించారు.

శ్రీవారే సూచించినట్లుగా..

శ్రీవారే సూచించినట్లుగా..

ఇలాగే నేడు చిలుకూరులో సుందరేశ్వరస్వామి సన్నిధిలో కూర్మమూర్తి(తాబేలు) ప్రత్యక్షమవడం అంటే త్వరలోనే లోకం నుంచి ఈ కరోనా మహమ్మారి వైరస్ అంతమై అమృతం లభిస్తుందని సాక్షాత్తూ ఆ వేంకటేశ్వరస్వామి సూచిస్తున్నట్లుగా ఉందని అర్చకులు తెలిపారు.

Recommended Video

Tirumala Darshans Should Stop : Ramana Deekshitulu - ఆపాల్సిన అవసరం ఏముంది ? YV Subba Reddy
తొందరలోనే మంచి ఫలితం..

తొందరలోనే మంచి ఫలితం..

వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవలు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్నింటికీ తొందరలో మంచి ఫలితం వస్తుందని ప్రధాన అర్చకులు రంగరాజన్ వ్యాఖ్యానించారు. కాగా, ఆలయంలోకి వచ్చిన ఈ తాబేలు 10 సెంటిమీటర్ల పొడవు, ఆరు సెంటిమీటర్ల వెడల్పు ఉందని అర్చకులు తెలిపారు.

English summary
end for covid 19: A tortoise appeared in chilkur balaji temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X