• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓటుకు నోటు కేసు-ఈడీ చార్జిషీట్-ప్రధాన నిందితుడిగా రేవంత్-చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లేనా?

|

ఆరేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డిని పేర్కొన్న ఈడీ... కేసులో మొదటిసారిగా టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కీర్తన్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చడం గమనార్హం. వీరితో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ తదితరులను నిందితులుగా చేర్చింది.

చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చారా..?

చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చారా..?

టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపై కూడా చార్జిషీటులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.ఈడీ చేసిన ట్వీట్‌లో మాత్రం చంద్రబాబు పేరు కనిపించలేదు. చార్జిషీటులో పేరు ప్రస్తావించడానికి,నిందితుల జాబితాలో పేరును చేర్చడానికి చాలా తేడా ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఒకరకంగా చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లేనని.. ఆయనకు ఇది బిగ్ రిలీఫ్ అని టీడీపీ మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు,ఇన్నాళ్లు తమ అధినేతపై తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడేమంటారని ప్రశ్నిస్తున్నారు.

ఆడియో,వీడియో ఫుటేజీలతో సహా..


ఈ కేసుకు సంబంధించి అప్పట్లో కలకలం రేపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడియో ఫుటేజీ,రేవంత్ రెడ్డి స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ పట్టుబడ్డ వీడియో ఫుటేజీని చార్జిషీటుకు ఈడీ జతచేసినట్లు సమాచారం. అప్పట్లో రూ.50 లక్షలు స్టీఫెన్‌సన్‌కు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే డీల్ ప్రకారం ఇస్తానన్న మిగతా డబ్బులు ఎక్కడినుంచి తీసుకురావాలనుకున్నారు అన్న దానిపై చార్జిషీట్‌లో ఈడీ వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో త్వరలోనే కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

గతేడాది ఏసీబీ చార్జిషీట్...

గతేడాది ఏసీబీ చార్జిషీట్...


గతేడాది మార్చిలో ఇదే కేసుకు సంబంధించి ఏసీబీ కూడా చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.కీలక ఆధారాలతో ఏసీబీ మొత్తం 960 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేసింది. నిందితుల పాత్రపై ఇందులో కీలక ఆధారాలు పొందుపరిచింది. ఇదే కేసుకు సంబంధించి వెలుగుచూసిన ఆడియో టేపుల సంభాషణపై ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కూడా గతేడాది కోర్టుకు చేరింది. ఈ కేసులో ఏసీబీ దర్యాప్తును సవాల్ చేస్తూ అప్పట్లో రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదని అందులో పేర్కొన్నారు. అయితే ఏసీబీ కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.

  Megastar Chiranjeevi ఆక్సిజ‌న్ బ్యాంకులు స్టార్ట్, Ram Charan పర్యవేక్షణ || Oneindia Telugu
  మున్ముందు పరిణామాలపై ఉత్కంఠ...

  మున్ముందు పరిణామాలపై ఉత్కంఠ...


  అటు ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు ఈడీ కూడా చార్జిషీట్ దాఖలు చేయడంతో ఈ కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుబోతున్నాయో అన్నది ఆసక్తికరంగా మారింది.అప్పట్లో 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బుతో ప్రలోభ పెట్టినట్లు రేవంత్ రెడ్డి,చంద్రబాబులపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు రూ.3 కోట్లకు డీల్ మాట్లాడి మొదట రూ.50లక్షలు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. అయితే స్టీఫెన్‌సన్ దీనిపై అప్పటికే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పక్కా ప్లాన్‌తో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఇదంతా తనపై కుట్రపూరితంగా జరిగిందని రేవంత్ ఆరోపిస్తూ వస్తున్నారు.

  English summary
  Another key development has taken place in the cash for vote which caused a sensation in the Telugu states six years ago. The Enforcement Directorate (ED) has recently filed a chargesheet in the case. Revanth Reddy has been named as the main accused in the case.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X