దారుణం: స్నేహితులే పెట్రోల్ పోసి బీటెక్ విద్యార్ధిపై హత్యాయత్నం
హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్ధిపై అతని స్నేహితులే పెట్రోలు పోసి చంపాలని చూశారు. ఈ సంఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలోని మొయినాబాద్ మండలం ఆమదాపూర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న అభినవ్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి శివ మహేష్‌పై అతని స్నేహితులు హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో విద్యార్ధి శరీరం 90 శాతం కాలిపోయింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పారిపోయారు.

స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని హూటాహటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేశాడా లేదా స్నేహితులే పెట్రోల్ పోసి చంపాలని చూశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
శివ మహేష్ సొంత ఊరు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పుర్ అని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.












Click it and Unblock the Notifications