బీజేపీలో మగాళ్లు లేరా?: ఓ మహిళను బలిపశువు చేశారు: ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా.. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం చురుగ్గా సన్నాహాలు కొనసాగుతున్న వేళ- ఉద్వాసనకు గురైన ఆ పార్టీ నాయకురాలు నుపుర్ శర్మ వ్యవహారం కాస్త ఇబ్బందులకు గురి చేస్తోంది. విమర్శలకు కేంద్రబిందువు అవుతోంది. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం తప్పు పట్టింది. దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడానికి కారణం అయ్యాయని పేర్కొంది. యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలంటూ ఆదేశించింది.
దీనిపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి స్పందించారు. కొద్దిసేపటి కిందటే ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకులు తమ పార్టీ ప్రయోజనాల కోసం మతం అనే సున్నితమైన అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. తాను ఇబ్బందుల్లో పడిన ప్రతీసారీ బీజేపీ నాయకులు.. ఈ అంశాన్ని ప్రస్తావిస్తోన్నారంటూ ఆరోపించారు. ఇబ్బందులు వచ్చిన ప్రతీసారీ మతాన్ని అడ్డం పెట్టుకుంటోందని ధ్వజమెత్తారు.

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నుపుర్ శర్మ మాత్రమే క్షమాపణలు చెప్పడం సరికాదని రేణుకా చౌదరి తేల్చి చెప్పారు. మొత్తం బీజేపీ నాయకులందరూ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. చెవులు పట్టుకుని మైనారిటీలకు మన్నించాలని వేడుకోవాలని అన్నారు. బీజేపీ పరిస్థితి దయనీయంగా తయారుకావడానికి ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పారు.
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓ మహిళను బలిపశువు చేశారంటూ మండిపడ్డారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే విషయంలో బీజేపీ అగ్ర నాయకులు నుపుర్ శర్మను రెచ్చగొట్టారని ఆరోపించారు. తప్పు వాళ్లు చేసి, నిందలను నుపుర్ శర్మపై వేశారని, పార్టీ నుంచి తొలగించి, అవమాన పరిచారని రేణుకా చౌదరి విమర్శించారు. మహిళకు బదులుగా తాము ముందుకు వచ్చి, క్షమాపణ చెప్పడానికి బీజేపీలో మగాళ్లు ఎవరూ లేరా? అని ప్రశ్నించారు. దేంట్లోనైనా దూకి చావండి అంటూ ఘాటుగా విమర్శించారు.
Recommended Video

-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications