బీ అలర్ట్.. తెలంగాణలో మళ్లీ భూకంపం..? అమరావతి వరకు ఎఫెక్ట్..!
ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా హిమాలయ, మయన్మార్- చైనా సరిహద్దుల్లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే తాజాగా EPIC ఎర్త్‌క్వేక్ సంస్థ బాంబ్ పేల్చింది. త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతోందని హెచ్చరించింది. తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందిని వివరించింది. అయితే ఎపిక్ ఎర్త్‌క్వేక్.. గతంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది. అవి కొన్నిసార్లు నిజం అయ్యాయి.
తెలంగాణలో త్వరలో భూకంపం రాబోతోందని.. ఎపిక్ ఎర్త్‌క్వేక్ అంచనా వేసింది. తమ పరిశోధన ప్రకారం.. తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్ వరకు ఉంటుందని వివరించింది. అటు ఏపీలోని అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండొచ్చని అంచనా వేసింది. మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఎపిక్ ఎర్త్‌క్వేక్.. గతంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది. ఆ అంచనాలు కొన్నిసార్లు నిజం అయ్యాయి.
తెలంగాణలో భూకంపాలు
డిసెంబర్ 4, 2024న ములుగు జిల్లా మేడారం వద్ద 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది. ఆ తర్వాత డిసెంబర్ 7, 2024- మహబూబ్‌నగర్ జిల్లా దాసరిపల్లి వద్ద 3.0 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది.
గత చరిత్ర చూస్తే..
2021 జనవరి 26- పులిచింతల వద్ద 4.8 తీవ్రతతో భూకంపం నమోదైంది.
2020 ఏప్రిల్ 24- ఆసిఫాబాద్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.
1983- మేడ్చల్‌లో 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.
1969- భద్రాచలం ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.

తెలంగాణ ప్రాంతం సాధారణంగా తక్కువ భూకంప తీవ్రత కలిగిన జోన్-2లో ఉంది. అయితే.. గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉండటం వల్ల.. అప్పుడప్పుడు భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. రిక్టార్ స్కేల్ పై 5 కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు తెలంగాణలో చాలా అరుదుగా వస్తాయని నిపుణులు తెలిపారు.












Click it and Unblock the Notifications