దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్.. హైదరాబాద్‌లో ఎక్కడంటే..?
సినిమా లవర్స్ కోసం హైదరాబాద్ లో ఇప్పటికే రకరకాల టెక్నాలజీతో కూడిన సినిమా థియేటర్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రసాద్ ఐమాక్స్, ఏఎంబీ సినిమాస్, ఎపిక్ స్క్రీన్, లాంటి థియేటర్లు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు సినిమా అంటే ఎంత ప్రేమో తెలిసిందే. అటు ఓటీటీ అయినా థియేటర్ అయినా సినిమాను అభిమానిస్తారు. ఈ క్రమంలో సినీ అభిమానులకు ఓ శుభవార్త. అల్లు సినిమాస్.. దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ సినిమా స్క్రీన్ ను హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
సినిమా లవర్స్ మరో గుడ్ న్యూస్. మాస్ మహారాజ రవితేజ ఇటీవల హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఏఆర్ టీ సినిమాస్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో ఎపిక్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో తొలి ఎపిక్ స్క్రీన్ ఇదే కావడం విశేషం. ఇప్పుడు మరో అత్యాధునిక టెక్నాలజీతో హైదరాబాద్ లో తొలి స్క్రీన్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు అల్లు సినిమాస్.. దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ సినిమా స్క్రీన్ ను హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్లు స్పష్టం అవుతోంది. భాగ్య నగర ప్రజలకు సరికొత్త సౌండ్ సిస్టమ్ తో ఊహించని అనుభూతిని పంచనుంది. ఈ మూవీని సరికొత్త విధంగా ఆస్వాధించేందుకు పిచ్- బ్లాక్ స్టేడియం సీటింగ్ ఏర్పాటు చేయనున్నారు.

ఈ డాల్బీ సినిమా స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పుతో ఉండనుంది. అత్యుత్తమ విజువల్స్ కోసం ఇందులో డాల్బీ విజన్, డాల్బీ 3డీ ప్రొజెక్షన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీనికి తోడు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేసే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను కూడా జతచేస్తున్నారు. వీక్షకులకు ఎలాంటి ఆటంకం లేకుండా సినిమాను ఆస్వాదించేందుకు 'పిచ్- బ్లాక్ స్టేడియం సీటింగ్' ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి డిసెంబర్ 19న రిలీజ్ కానున్న అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా ద్వారా ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇక ఈ డాల్బీ టెక్నాలజీని ఆస్వాధించాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
రూ.10 కోట్లు బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్స్ !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications