రైతులతో ఎర్రబెల్లి మాటామంతి.!కుశల ప్రశ్నలు.!సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు.!
జనగామ/హైదరాబాద్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాసేపు తాను మంత్రిననే అంశం పక్కన పెట్టారు. తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలతో పాటు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. కేవలం సమస్యలు మాత్రమే తెలుసుకోకుండా రైతులతో మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేసారు. స్నేహితులతో, బంధువులతో ఎలా కలివిడిగా మాట్లాడతామో అంతే కలిసిపోయే విధంగా వ్యవహరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

రైతు సమస్యలను ప్రత్యక్ష్యంగా తెలుసుకున్న ఎర్రబెల్లి..
రైతులతో
కుశల
ప్రశ్నలు
వేస్తూ,
సమస్యల
గురించి
ఆరా
తీసారు
మంత్రి
ఎర్రబెల్లి.
ధాన్యం
రవాణా
సమస్యలు
వెంటనే
పరిష్కరించాలని
మంత్రి
ఎర్రబెల్లి
దయాకర్
రావు
అధికారులకు
ఆదేశాలు
జారీ
చేసారు.
జనగామ
జిల్లా
దేవరుప్పుల
మండలం
చిన్నగూడూరు
గ్రామంలో
ధాన్యం
కొనుగోలు
కేంద్రాన్ని
పరిశీలించారు
మంత్రి
ఎర్రబెల్లి
దయాకర్
రావు.
అక్కడే
ఉన్న
రైతులతో
స్నేహపూర్వకంగా
మాట్లాడారు.
సతమస్యలుంటే
చెప్పాలని.
సత్వర
పరిష్కారానికి
కృషి
చేస్తానని
హామీ
ఇచ్చారు.

సద్దులు తెచ్చుకున్నారా.? మీకేనా? మాకు ఏమైనా ఉన్నదా?
ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి ఎండాకాలంలో తలెత్తే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నది? మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఒక మహిళా రైతు వద్ద నుంచి ఆమె తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ తెరిచి అందులో ఏముందో చూసి, తెచ్చింది అంతా నువ్వే తిన్నావా? నాకేమీ ఉంచ లేదా? అంటూ మంత్రి రైతు కూలీలతో కాసేపు సరదాగా ముచ్చటించారు.

ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు లారీలు రావట్లేదు
ఇదిలా
ఉండగా
రైతులు
మంత్రి
దృష్టికి
ట్రాన్స్పోర్టేషన్
సమస్యల
వల్ల
విద్యత్
లో
అంతరాయం
కలుగుతుందని,
వెంటనే
చర్యలు
తీసుకోవాల్సిందిగా
విజ్ఞప్తి
చేసారు.
తక్షనం
సంబంధిత
అధికారులు,
జిల్లా
కలెక్టర్
తో
మంత్రి
దయాకర్
రావు
మాట్లాడారు.
కొనుగోలు
చేసిన
ధాన్యాన్ని
తీసుకెళ్లడానికి
లారీలు
రావడం
లేదని
అక్కడి
రైతులు
చెబుతున్న
విషయాన్ని
అధికారుల
దృష్టికి
తీసుకెళ్లారు.
ఆ
సమస్యను
పరిష్కరించాలని
మంత్రి
సంబంధిత
అధికారులకు
ఆదేశించారు.

ఎలాంటి సమస్యలైనా చెప్పుకోవచ్చు..
అక్కడే ఉన్న అధికారితో మాట్లాడి లారీలు ఎందుకు రావడం లేదో కారణాలు తెలుసుకుని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తేవాలని రైతులకు మంత్రి సూచించారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన ఆఖరు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రి ఆకస్మిక పర్యటన, మాటామంతి, కుశల ప్రశ్నలతో రైతులు సంబ్రమాశ్చర్యానికి గురైనట్టు తెలుస్తోంది.