వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గజ్వేల్ నంచి ఈటల - సీఎం కేసీఆర్ ఎక్కడ నుంచి : బండి స్థానం మార్పు - గెలిచేదెవరు..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ లో బీజేపీ కొత్త అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల కోసం నయా స్కెచ్ సిద్దం చేస్తోంది. ఆ పార్టీ నేతలకు ఇప్పుడు టీఆర్ఎస్ ను ఎదిరించి నిలబడటం సవాల్ గా మారుతోంది. దీంతో..టీఆర్ఎస్ తో జరిగిన పరాభవంతో బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల తన మనసులోని ఆలోచన బయట పెట్టేసారు. ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి గెలుపొందిన ఈటల..వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా సీఎం కేసీఆర్ పైన పోటీ చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే పార్టీ అధినాయకత్వం నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇప్పటికే అక్కడ క్షేత్రస్థాయి పనిని ప్రారంభించారు. ఈటల తొలుత టీఆర్ఎస్ లో చేరిది గజ్వేల్ నుంచి అనే విషయం గుర్తు చేస్తున్నారు. బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీని బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓడించిన సీన్‌ను ఇక్కడా పునరావృతం చేస్తామనే ధీమా వ్యక్తం చేశారు.

గజ్వేల్ లో ఈటల.. ముందస్తు వ్యూహం

గజ్వేల్ లో ఈటల.. ముందస్తు వ్యూహం

కానీ, ఇదే సమయంలో అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తారా..ఎమ్మెల్యేగానే మరోసారి బరిలో నిలుస్తారా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. జాతీయ రాజకీయాలపైన ఫోకస్ పెట్టిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి..ఆ తరువాత లోక్ సభ ఎన్నికలకు కొంత సమయం ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా లోక్ సభకు పోటీ చేసే అంశం పైన నిర్ణయం తీసుకోనున్నారు. తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..కేసీఆర్ లోక్ సభకు పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

అందునా ఆయన మరోసారి మహబూబ్ నగర్ నుంచే బరిలో ఉంటారని తెలుస్తోంది. దీంతో.. ముందుగా కేసీఆర్ ఎమ్మెల్యేగానే గజ్వేల్ నుంచి బరిలో ఉంటారనే సమాచారంతోనే ఈటల ఈ సవాల్ కు సిద్దమయ్యారు. ఫలితం ఏ విధంగా ఉన్నా.. తరువాతి ప్రణాళికలు సైతం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.

బండి సంజయ్ పోటీ స్థానం ఫైనల్

బండి సంజయ్ పోటీ స్థానం ఫైనల్


గజ్వేల్ లో కేసీఆర్ పైన పోటీకి దిగిన తరువాత అనూహ్యంగా హుజూరాబాద్ బై పోల్ లో గెలిస్తే..అది సంచలనం అవుతుంది. ఈటల రాజకీయ జీవితంలోనే మైలురాయిగా మారుతుంది. అయితే, మరి హుజూరాబాద్ నుంచి ఎవరు పోటీ చేయాలనే దాని పైన బీజేపీ అధినాయకత్వం ఒక అంచనాకు వచ్చింది. ఈటల గజ్వేల్ నుంచి పోటీకి దిగితే..హుజూరాబాద్ నుంచి ఈటల సతీమణి బీజేపీ అభ్యర్దిగా బరి లో ఉంటారని తెలుస్తోంది.

హుజూరాబాద్ బై పోల్ సమయంలోనూ ఈటల సతీమణి అక్కడ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో..తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ సారి లోక్ సభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయటం ఖాయమైనట్లు సమాచారం. బండి సంజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి బరిలోకి దిగనున్నారు.

అసెంబ్లీ ఫలితం - పార్లమెంట్ పై ఫోకస్

అసెంబ్లీ ఫలితం - పార్లమెంట్ పై ఫోకస్


అయితే, గజ్వేల్ లో ఈటల గెలిస్తే ఓకే. లేకుంటే.. ఈటల ఆ తరువాత జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రస్తుతం బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే విధంగా స్కెచ్ సిద్దమైందని విశ్వసనీయ సమాచారం. అదే విధంగా.. గ్రేటర్ పరిధిలోనూ భారీ మార్పుల దిశగా బీజేపీ స్కెచ్ రెడీ అవుతోంది.

టీఆర్ఎస్ కంచుకోటల్లో గులాబీ శ్రేణులను తమ పార్టీలో చేర్చుకొనే అంశం పైన తెర వెనుక వ్యూహాలను వేగంగా అమలు చేస్తోంది. గ్రేటర్ తో పాటుగా ఉమ్మడి మెదక్.. కరీంనగర్.. నిజామాబాద్.. అదిలాబాద్ జిల్లాల్లో తమకు అనకూల పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో.. ముందుగా పార్టీలో చేరికల పైన ఫోకస్ పెట్టిన నాయకత్వం కీలక నేతలకు గాలం వేస్తోంది. దీంతో..తెలంగాణలో రానున్న రోజుల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

English summary
Etala Rajender contest from Gajewel against CM KCR in Up coming elections, at the same time BAndi Sanjay constitunecy also fixed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X