సీఎం సీటు కోసం కేటీఆర్, హరీశ్ రావు పోటీ పడ్డారు: మంత్రి పదవి తనవల్లేనంటూ ఈటల రాజేందర్
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు కేసీఆర్ సర్కారు, మంత్రులపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతూనే.. తాను నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెబుతున్నారు. ప్రజల పక్షాన నిలబడే తనను గెలిపించుకోవాలంటూ పిలుపునిస్తున్నారు.

కేసీఆర్‌తో ఆరేళ్లుగా అనుభవించిన బాధకు విముక్తి: ఈటల
తాజాగా, జమ్మికుంటలో నిర్వహించిన సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. దళిత జాతి ఆత్మగౌరవం కోసం తన చిన్ననాడే కొట్లాడి తమ కుల బహిష్కరణకు గురైనట్లు తెలిపారు ఈటల. అలాంటి కుటుంబం తమదని గుర్తు చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నానని.. కేసీఆర్‌తో ఆరేళ్లుగా అనుభవిస్తున్న బాధ నుంచి విముక్తి పొందానని తెలిపారు. కేసీఆర్ చెబితే వినే రకం కాదని.. ఆయనకు అంత గొప్పమనసు లేదని.. తనకు మాత్రమే తెలివి ఉందని అనుకునే వ్యక్తి కేసీఆర్ అని ఈటల రాజేందర్ విమర్శించారు. 2018లోపే తమ లాంటి వాల్ల బొండిగ పిసకాలని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన వాడికి డబ్బులు ఇచ్చి కరపత్రాలు కొట్టించారిన ఈటల ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థికి డబ్బులు ఇచ్చి తనను ఓడగొట్టాలని చూశారని కేసీఆర్‌పై ఈటల మండిపడ్డారు.

సీఎం సీటు కోసం కేటీఆర్, హరీశ్ రావు పోటీ పడ్డారంటూ ఈటల
జెండాకి ఓనర్లం తామేనని గొంతెత్తి మాట్లాడితేనే హరీశ్ రావుకు మంత్రి వచ్చిందన్నారు ఈటల. పదవుల కోసం పెదవులు మూసిందని హరీశ్ రావేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్, హరీశ్ రావు పోటీ పడ్డారని ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో అంతా అబద్ధాల కోరులేనని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి.. కేసీఆర్ మోసం చేశారని, ఉపముఖ్యమంత్రిని చేసి ఆ తర్వాత తొలగించి అవమానించారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళిత అధికారులకు కూడా గౌరవం లేదని అన్నారు. ప్రదీప్ చంద్రకు కేసీఆర్ ఇచ్చిన గౌరవం ఏంది? అకునూరి మురళి ఉసురు పోసుకున్నవాడు కేసీఆర్.. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదివే పిల్లలు ఎవరెస్ట్ అంత ఎదగాలని ఆశించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పొమ్మనలేక పొగబెట్టి బయటకు పంపించిండు అని విమర్శలు గుప్పించారు ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉపఎన్నికల కోసమే దళితబంధు తీసుకొచ్చారని ఆరోపించారు ఈటల రాజేందర్. 45 వేల ఓట్లు ఉన్న కులం మన దళితులు. లెక్క చూసుకుని ఓట్ల కోసం 10 లక్షల స్కీం తీసుకువచ్చిండు. నేను రాజీనామా చెయ్యకపోతే దళితుబంధు వచ్చేదా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. మన పుట్టుకకు కారణమైన అమ్మనాన్నలను ఎలా మర్చిపోమో.. తనను కూడా మర్చిపోవద్దని ఈటల ప్రజలను కోరారు. మైనార్టీలకు కూడా దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.
Recommended Video

అబద్ధాల ముఖ్యమంత్రిని నమ్మొద్దంటూ వివేక్ వెంకటస్వామి
మరోవైపు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈటల రాజేందర్ విజయం కోసం దళితులంతా కృషి చేయాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లుగా తన కుటుంబంలోని ఆరుగురికి అవకాశం ఇప్పించిన కేసీఆర్.. ఒక్క దళితుడికి కూడా ఇప్పించలేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ దళితుల ద్రోహి అని ఇప్పటికే అనేక మంది చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 12 మంది దళితులను కేబినెట్లోకి తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం దళిత వ్యక్తిని రాష్ట్రపతిని చేసింది. కేసీఆర్ మాత్రం ఒకే దళిత వ్యక్తిని రాష్ట్ర కేబినెట్లోకి తీసుకున్నారు. తన కుటుంబం నుంచి కొడుకు, అల్లుడు సహా ఆరుగురు బంధువులకు కేబినెట్ హోదా ఇచ్చారు. కేసీఆర్‌కు దళితులపై ఎక్కడ ప్రేమ ఉంది? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్.. కనీసం తన తర్వాతైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం లేదు. కేసీఆర్ దళిత ద్రోహి. మూడెకరాలు ఇస్తానని కేసీఆర్ చెప్పినప్పుడు ఐదు లక్షలకు ఎకరా కొనిస్తానన్నాడు. 50 వేల కోట్లతో భూమి కొనిస్తానని అబద్ధాలు చెప్పాడు. దళితుల్లో ఎక్కువగా కౌలు రైతులే ఉంటారు. కానీ రైతుబంధు కౌలు రైతులకు ఇవ్వడం లేదు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌లో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడాను. వాళ్లంతా కౌలురైతులే. దళిత కౌలు రైతులకు ఎందుకు రైతుబంధు ఇవ్వరని ప్రశ్నించాను. కేసీఆర్ ఎప్పటికీ దళితులకు వ్యతిరేక కార్యక్రమాల గురించే ఆలోచిస్తారు. అప్పుడే మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే వాటి విలువ 50 లక్షలు ఉండేది. డబుల్ బెడ్ రూం ఇస్తే దాని విలువ 15 లక్షలు ఉండేది. కానీ, ఈటలను ఓడించేందుకు, దళితులను మభ్యపెట్టేందుకు మరోసారి మోసం చేయడానికి దళితబంధు ప్రకటించారు. పదిలక్షలు డబ్బులు వేసినట్లే వేసి... అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. మన ఓట్ల కోసమే కేసీఆర్ ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే.. సీఎం దిగివచ్చి దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తాడు. అబద్ధాల ముఖ్యమంత్రి ఉప ఎన్నికల్లో మాయమాటలు చెప్పి.. ఎన్నికలయ్యాక మర్చిపోతాడు. ఇద్దరు దళిత ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ పక్కన పెట్టారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. జమ్మికుంటలో జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈమేరకు కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications