బీఆర్ఎస్ దుకాణం బంద్, బీజేపీ ఎమ్మెల్యేలు వస్తారన్న కోమటిరెడ్డి: ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్
బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని.. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం పెద్ద పని కాదని అన్నారు. ఈ ఇద్దరు నేతలు మధ్య జరిగిన మాటల యుద్ధం ఇలా కొనసాగింది.
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఈ లోక్‌సభ ఎన్నిల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడతాం అంటే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదేమైనా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అనుకుంటున్నారా? అని మండిపడ్డారు. అవసరమైతే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.

మరోవైపు, బీఆర్ఎస్ నేతలపైనా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడితే డబుల్ బెడ్ రూం సరిపోతుందని రేవంత్ అనుకున్నారని.. కానీ, జైల్లో ప్రగతి భవన్ కట్టాల్సి వస్తుందేమో అని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. యాదగిరిగుట్టకి బంగారం వసూలు చేశారని.. అది ఎక్కడ ఉందో తెలియదన్నారు. యాదగిరి గుట్ట పేరు మార్చటమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్లు కుంగితే ఏమవుతుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ చేసి ఉంటారని చెబుతున్నారని ధ్వజమెత్తారు. సుమోటోగా కేటీఆర్ పై కేసు పెట్టాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఫోన్ ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నాడు.. దాని మీద కోర్టుకు వెళితే అరెస్టవుతాడని చెప్పారు.
మరోవైపు, పెద్ద సినిమాలు.. థియేటర్ల దోపిడీపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా హాల్లో స్నాక్స్ రేట్లు పెంచి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్ పెంచుకుని సినిమాలు తీసి.. రేట్లు పెంచండి అంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్న సినిమాలు తీసిన వారికి కనీసం థియేటర్లు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డికి ఈటల రాజేందర్ కౌంటర్
కాంగ్రెస్‌తో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటే బీజేపీకు 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదని అన్నారు. సికింద్రాబాద్‌లోని మహేంద్రాహిల్స్‌లో బీజేపీ నాయకుడు కొమురయ్య కార్యాలయంలో ఆయనను కలిసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పని చేయాలని ఈటల కోరారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి మాటలకు హద్దు లేకుండా పోయాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే వాళ్ల మాటలు కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే గొంతు పేరుతో మల్కాజిగిరిలో గెలిచి ప్రజలను పట్టించుకోలేదని రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఈ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
మల్కాజిగిరి బీజేపీ టికెట్ ఆశించిన వారందరితో కలిసి పని చేసి తప్పకుండా విజయం సాధిస్తామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబ్బుతో నాయకులను, కార్యకర్తలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు.
మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు చూసుకుని కాంగ్రెస్ నాయకులు మాట్లాడాలని ఈటల రాజేందర్ హితవు పలికారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications