• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్ అలా ఫీలవుతుంటారు: ఉసురు తగులుతుందంటూ ఈటల రాజేందర్ విమర్శలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యంమత్రి కేసీఆర్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నారాయణపేటలో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎవరూ ఇవ్వని పథకాలు అందిస్తున్నా.. అని ప్రగల్భాలు పలుకుతున్న మన సీఎంకేసీఆర్.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.

కేసీఆర్ చక్రవర్తిలా ఫీలవుతుంటారు: ఈటల రాజేందర్ ఫైర్

కేసీఆర్ చక్రవర్తిలా ఫీలవుతుంటారు: ఈటల రాజేందర్ ఫైర్

మన సీఎం ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక చక్రవర్తిలా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్. నాలుగేళ్ళ నుంచి రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. ఒకసారి పత్తి అంటాడు ఒకసారి సన్న వడ్లు అంటాడు కానీ రైతులకు లాభం రాలేదని ధ్వజమెత్తారు ఈటల రాజేందర్.

సన్న వడ్లు పండించిన వారికి ఐదు పైసలు బిళ్ళ లాభం రాలేదన్నారు. ఇప్పుడు వడ్లు పండించొద్దు అంటాడు.. దానికి కారణం కేంద్రం అని అంటారు.. అని కేసీఆర్‌పై ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇక్కడ వచ్చిన పంటను మిల్లింగ్ చేసే కెపాసిటీ మన మిల్లులకు లేదు. మమ్మల్ని ఆదుకోండి అని మిల్లర్లు అడుక్కుంటున్నా వారిని పట్టించుకోరని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక క్వింటాలు వడ్లకు 10కిలోల తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్.. చెంపలేసుకుని వడ్లు కొను.. లేదంటే: ఈటల ఫైర్

కేసీఆర్.. చెంపలేసుకుని వడ్లు కొను.. లేదంటే: ఈటల ఫైర్

దేశంలో ఉప్పుడు బియ్యం కొనే పరిస్థితులు లేవని రెండున్నర సంవత్సరాల నుండి ప్రత్యుత్తరాలు నడుస్తుంటే అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు వద్దు అంటున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్ పరిస్థితి ఎలా ఉందంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు అని ధ్వజమెత్తారు. ఎన్నో కోట్ల పథకాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎండాకాలం వడ్లు కొనడానికి అభ్యంతరం ఏమిటి? ప్రశ్నించారు. అన్ని పథకాలు కేంద్రం ఇస్తుందని అమలు చేస్తున్నావా? ఇప్పటికైనా చెంపలేసుకొని వడ్లు కొనుగోలు చేయకపోతే పుట్టగతులు ఉండవని దుయ్యబట్టారు. తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందన్నారు 75శాతం ప్రజలు కేసీఆర్ పాలన బాగాలేదని సర్వేలో తేలిందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

Recommended Video

  అనూహ్య విజయంతో పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టిన ఈటల || Oneindia Telugu
  టీఆర్ఎస్ నేతలపై సర్దార్ రవీందర్ సింగ్ ఫిర్యాదు

  టీఆర్ఎస్ నేతలపై సర్దార్ రవీందర్ సింగ్ ఫిర్యాదు

  ఇది ఇలావుండగా, ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూడా కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్‌. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న వారిని ప్రలోభపెట్టే విధంగా క్యాంపులకు తరలించారన్నారు. ప్రత్యేక బస్సుల్లో నేరుగా పోలింగ్ బూత్‌కు ఓటర్లను తీసుకొచ్చారన్నారు. మంత్రి గంగుల కమలాకర్ సుమారు 100 మందితో టీఆర్ఎస్ పార్టీ అనుకూల నినాదాలు చేస్తూ ర్యాలీగా పోలింగ్ బూతులోకి వెళ్లినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలింగ్ బూత్‌లోనే మంత్రి గంగుల రెండు గంటల పాటు ఉన్నా.. పోలీసులు పట్టించుకోలేదన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా మాస్కులు లేకుండా పోలింగ్ బూత్‌లోకి వచ్చారన్నారు. వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు రవీందర్ సింగ్ తెలిపారు.

  English summary
  Etala Rajender slams CM KCR for farmers suicide issue.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X