తాటాకు చప్పుళ్ళకు భయపడం: సింగరేణిపై చర్చకు సిద్ధమా?
మోడీ పర్యటన సమయంలో సింగరేణిపై బీఆర్ఎస్ ఆందోళనలను, పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తనకు నోటీసులు ఇవ్వడాన్ని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తప్పుపట్టారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపైన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఈటల రాజేందర్ రేపటి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునివ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. సింగరేణి మీద ఏ వేదిక మీద అయినా చర్చకు సిద్ధమని, నిజాయితీ ఉంటే రావాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ ప్రతీసారి తన చేతకానితనాన్ని పక్కవారి మీద రుద్దుతారన్నారు .11 వేల కోట్ల అభివృద్ధి పనులు చేయడానికి ప్రధాని వస్తుంటే, ఆ సమావేశంలో పాల్గొనకుండా, ప్రధానిని రాష్ట్రానికి ఆహ్వానించకుండా అబద్ధం ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు. 6300 కోట్లతో రామగుండం ఫెర్టిలైజర్స్ ను తిరిగి ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పారని, బొగ్గు గనుల విషయంలో 51 శాతం రాష్ట్రం వాటా ఉన్న తరువాత కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుంది అని ప్రధాని మాట్లాడారు. దానికి సమాధానం లేదన్నారు.
కానీ ఇప్పుడు మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులను తగ్గించి సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తుంది మీరు అని కెసిఆర్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి అనేక లెక్కలను కూలంకషంగా వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ మోసాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని, సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెడతారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అంతేకాదు కేసీఆర్ కు ప్రైవేట్ వ్యక్తుల మీద ఉన్న శ్రద్ధ సింగరేణి మీద లేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, రాష్ట్రం వచ్చినప్పుడు 3,500 కోట్ల బ్యాంకు నిలువలతో ఉన్న సింగరేణి ఇప్పుడు పదివేల కోట్ల అప్పులలో కూరుకుపోయిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 20 వేల కోట్ల రూపాయల అప్పు ఉందని పేర్కొన్న ఈటల 17000 కోట్లు విద్యుత్ బకాయిలు కాగా, 3000 కోట్లు బొగ్గు బకాయిలు ఉన్నాయని తెలిపారు.
ఇక ఇదే సమయంలో పేపర్ లీకేజీ కేసులో పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులకు స్పందించిన ఈటల తాను టెక్నాలజీకి అప్డేట్ కాలేదని, ఎవరు మెసేజ్ చేసిన తను రిప్లై ఇవ్వనని, ఎవరో ఒక వ్యక్తి తన వాట్సప్ నెంబర్ కు మెసేజ్ పంపించినంతమాత్రాన పోలీసులు తనకు నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.
తాను అసలు ఆ మెసేజ్ ను చూడలేదని పేర్కొన్న ఈటల నోటీసులకు, జైళ్ళకు భయపడేది లేదన్నారు. తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని, పోలీసులు పంపించిన నోటీసులకు సమాధానం ఇచ్చి తీరుతానని స్పష్టం చేశారు . చట్టం మీద తనకు గౌరవం ఉందన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, అందుకే ఇదంతా చేస్తున్నారన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications