వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైవ్, తెలంగాణ బడ్జెట్: కేంద్రం నుంచి సాయం లేదు.. ఈటెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం శాసన సభలో 2016 17 బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఈటెల మాట్లాడుతూ... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు. సీఎం కెసిఆర్ ప్రతి శాఖ తీరును సమీక్షించారన్నారు.

ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది మూడోసారి. కేంద్రం నుంచి సాయం కోసం చూస్తున్నప్పటికీ.. సరైన సాయం అందడం లేదన్నారు. గత రెండేళ్లుగా సరైన వర్షపాతం లేదన్నారు. స్థూల ఉత్పత్తి 11.67 శాతంగా నమోదైందన్నారు.

కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన సాయం రూ.450 కోట్లు మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 21 నెలల్లోనే తాము బంగారు తెలంగాణకు బాటలు వేశామన్నారు. సాగునీరు, విద్యుత్ రంగాలకు పెద్ద పీట వేశామని చెప్పారు.బడ్జెట్ ప్రసంగం అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు

- బడ్జెట్ రూ. 1,30,415.87 కోట్లు
- ప్రణాళిక వ్యయం రూ. 67,630.73 కోట్లు
- ప్రణాళికేతర వ్యయం రూ. 62,785.14 కోట్లు
- రెవెన్యూ లోటు రూ. 3,318 కోట్లు
- ద్రవ్యలోటు రూ. 23,467.29 కోట్లు

Etela Rajender introduces Budget 2016 17
-

- తెలంగాణలో పథకాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు
- మేడిగడ్డ, ప్రాణహిత, పెన్ పహాడ్, తదుమ్మిడిహెట్టి ప్రాజెక్టుల నిర్మాణం
- గోదావరి, కృష్ణా నదులపై కర్నాటక, మహారాష్ట్రలు 450 ప్రాజెక్టులు నిర్మించాయి.
- గోదావరి, కృష్ణా నదుల్లో రాష్ట్రా వాటా 1250 టీఎంసీలు
- గృహ, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్
- డిజిటల్ తెలంగాణ లక్ష్యంగా ఐటికి రూ.254 కోట్లు
- ఖమ్మంలో మెగాఫుడ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి
- గ్రామాల్లో 36 వేలు, పట్టణాల్లో 24వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.
- కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి రూ.140 కోట్లు
- గ్రేటర్ వరంగల్‌ కార్పోరేషన్‌కు రూ.300 కోట్లు. కరీంనగర్, రామగుండం, ఖమ్మం, నిజామాబాద్‌ కార్పోరేషన్లకు

రూ.100 కోట్ల చొప్పున
- హైదరాబాదులో అమెజాన్, ఐటీసీ, మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు
- రూ.33,100 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం
- పోలీస్ క్వార్టర్స్ నిర్మాణంకు రూ.70 కోట్లు
- యాదగిరి గుట్ట, వేములవాడల అభివృద్ధికి అభివృద్ధి అథారిటీలు ఏర్పాటు చేశాం
- 40 చోట్ల డయాగ్నస్టిక్ సెంటర్లు, 40 చోటల డయాలసిస్ సెంటర్లు
- ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి శాఖ తీరును సమీక్షిస్తున్నారు.
- రాష్ట్రంలో కొత్తగా 63 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు
- హడ్కో నిధులతో డబుల్ బెడ్ రూం ఇళ్లు.
- మొత్తం సంక్షేమానికి రూ.13,412 కోట్లు
- మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహం
- వచ్చే మూడేళ్లలో 23,912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
- ప్రయివేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరిస్తాం.
- వరంగల్, ఖమ్మంలో రెండు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే

నిజమైన అభివృద్ధి.
- మైనార్టీల కోసం 70 ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు. విద్యావ్యవస్థ ప్రక్షాళణ
- హార్చికల్చర్ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేక కార్పోరేషన్
- గత ఏడాది 60 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు

- జిహెచ్ఎంసిలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు.
- ప్రత్యేక అభివృద్ధికి రూ.4675 కోట్లు
- సంక్షేమ రంగంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ
- మిషన్ భగీరథకు రూ.36,976 కోట్లు
- అగ్నిమాపక శాఖకు రూ.223 కోట్లు
- హైదరాబాదులో మరో నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు
- మైనార్టీ సంక్షేమానికి రూ.1204 కోట్లు
- విద్యాశాఖ ప్రణాళికేతర వ్యయం రూ.9044 కోట్లు
- విద్యాశాఖ ప్రణాళికా వ్యయం 1644 కోట్లు
- పర్యాటక శాఖకు రూ.50 కోట్లు
- రహదారులు, భవనాలకు రూ.3333 కోట్లు
- వంద శాతం రుణమాఫీ చేస్తాం
- ఆరోగ్య శాఖకు 5967 కోట్లు
- ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారోగ్యం భ్రష్టు పట్టించారు.
- వ్యవసాయానికి రూ.6759 కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ.4,815 కోట్లు
- ఐటీ, సమాచారంకు రూ.254 కోట్లు
- పంచాయతీరాజ్‌కు రూ.10,731 కోట్లు

- పారిశ్రామికరంగానికి రూ.967 కోట్లు
- మహిళా, శిశు సంక్షేమానికి రూ.1,553 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.2538 కోట్లు
- బ్రాహ్మణ సంక్షేమంకు రూ.100 కోట్లు
- కళ్యాణ్ లక్ష్మికి రూ.738 కోట్లు
- ఆసరా పథకానికి రూ.4,693 కోట్లు
- విద్యుత్ రంగంలో చీకట్లు తొలిగాయి. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా చేస్తున్నాం.
- మిషన్ భగీరథ సృష్టికర్త సీఎం కెసిఆర్
- ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలన్నది ప్రభుత్వం లక్ష్యం
- స్థూల ఉత్పత్తి వృద్ధి 11.67 శాతం
- ఎస్టీ సంక్షేమానికి రూ.3,752 కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి రూ.7,122 కోట్లు
- సీతారామ ఎత్తిపోతలకు రూ.1,150 కోట్లు
- రుణమాఫీకి రూ.3,718 కోట్లు
- కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.6,286 కోట్ల
- నీటి పారుదల రంగానికి రూ.25వేల కోట్లు
- పాలమూరు ఎత్తిపోతలకు 7,861 కోట్లు
- జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణలో ఎక్కువగా ఉంది.
- కేంద్ర నిధులు, పన్నుల్లో వాటా తగ్గింది
- ఇచ్చిన వాగ్ధానాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం

English summary
Minister Etela Rajender introduces Telangana State Budget 2016 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X