తెలంగాణకు నోట్ల సరఫరాపై ఈటెల
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన నోట్లలో 96 శాతం రూ.2000 నోట్లేనని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన కేంద్ర మంత్రి దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని, సీఎస్ ప్రదీప్ చంద్రతో కలిసి ఆర్బీఐ అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ రోజు వరకు ఆర్బీఐ నుంచి రూ.17,500 కోట్లు వచ్చాయని తెలిపారు. లెక్క ప్రకారం రూ.20 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి 5 వేల కోట్ల చిన్న నోట్లు ఇస్తేనే ప్రస్తుత ఇబ్బంది నుంచి బయటపడుతామన్నారు. తెలంగాణలో 83.37 కోట్ల కుటుంబాలకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు. అందులో ఎన్ని మనుగడలో ఉన్నాయో, ఎన్ని లేవో తెలియాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications