కేసీఆర్ పై పోటీ చేస్తా.. ఈటల రాజేందర్ సంచలన ప్రకటన!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుటికే అన్ని పార్టీల ముఖ్య నాయకులు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో, విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా మారింది.
తాజాగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి తాను బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. హుజురాబాద్ బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ లోను, గజ్వేల్ లోను పోటీ చేస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా తాను కూడా రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తానని, రెండింటిలోనూ తానే విజయం సాధిస్తానని, కేసీఆర్ ను చిత్తుగా ఓడిస్తానని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ పైనే పోటీ చేస్తానని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
ఈసారి ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్ కు దీటుగా నిలబడేందుకు ఈటల రాజేందర్ సై అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎవరికి వారు వ్యూహాత్మకంగా ఎన్నికల్లో పోటీకి సంబంధించి పార్టీ కార్యకర్తలతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారానికి దూకుడు పెంచుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ ఈ మేరకు ఏం కెసిఆర్ పై తాను బరిలోకి దిగుతానని సంచలన ప్రకటన చేశారు. గతంలో కూడా ఈటల రాజేందర్ గజ్వేల్ నుండి ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించారు. తాజాగా మరోమారు ఆయన కెసిఆర్ పై పోటీకి దిగుతానని ప్రకటన చేయడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మరి ఈటల నిజంగానే సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తారా? బీజేపీ అధినాయకత్వం ఈటలకు ఆ అవకాశం ఇస్తుందా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications