• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎమ్మెల్యేలు పరమ పవిత్రులా.. ప్రజాస్వామ్యం గురించి నువ్వా మాట్లాడేది కేసీఆర్: ఈటల ధ్వజం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ పై, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై, మునుగోడులో ఓటర్లను ఓట్ల కోసం కెసిఆర్ ప్రలోభ పెట్టిన విధానాలపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టార్గెట్ చేశారు. మీడియా సమావేశం పెట్టి మరీ తెలంగాణ సీఎం కేసీఆర్ దేశాన్ని కాపాడాలని, ఆ భాధ్యత న్యాయవ్యవస్థ, ప్రజలు, యువత, మీడియా మీద ఉంది అంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తెలంగాణను కాపాడాలని తెలంగాణ రాష్ట్రం బాధను అనుభవిస్తుంది అన్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అపహాస్యం చేశారని, మన గౌరవాన్ని మట్టిలో కలిపారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలను పార్టీలు మార్చింది ఎవరు? మీరు కాదా

ఎమ్మెల్యేలను పార్టీలు మార్చింది ఎవరు? మీరు కాదా

త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణా అని మరిచిపోయి, తాను చక్రవర్తి అనుకొని రాత్రికి పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ అసలు రూపం తెలంగాణ ప్రజలకు తెలిసిందని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఇక తమ ఎమ్మెల్యేల గురించి డబ్బాలు కొట్టుకుంటున్న కెసిఆర్ ఆ నలుగురు ఎమ్మెల్యేలు పరమ పవిత్రులు, నిప్పు కణికలు ఎలా అవుతారో చెప్పాలని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

2014 నుండి 2018 వరకు కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీలో 25 మంది శాసన సభ్యులను చేర్చుకున్నారు. 2018 లో 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా కూడా..తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను తన పార్టీలో చేరుకుని కాంగ్రెస్ పార్టీని నాశనం చేశాడని, 12 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లో చేసుకున్నారని గుర్తు చేశారు.

మీరు చేసింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యటం కాదా?

మీరు చేసింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యటం కాదా?

యాంటీ డిఫెక్షన్ చట్టంలో ఉన్న లొసుగులు అడ్డం పెట్టుకొని చేరికలకు తెరలేపింది కెసిఆర్ అని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని వేదికలపైన కూర్చోబెట్టుకొని సంక్షేమ పథకాల చెక్కులను మంత్రులు అందిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అపహస్య చెయ్యడం కాదా? అని ప్రశ్నించారు.

పార్టీ మారిన వారికి మంత్రి పదవి ఇచ్చావు అంటే ఇదేం ప్రజాస్వామ్యమో చెప్పాలన్నారు. మేము కూడా అన్నీ న్యాయమూర్తులకు, ముఖ్యమంత్రులకు, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లకు కెసిఆర్ ఎనిమిదేళ్ళ నియంతృత్వ పాలన, ఎమ్మెల్యేల చేరికలమీద నివేదికలు పంపిస్తామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

మీడియాను అణగదొక్కింది మీరు కాదా?

మీడియాను అణగదొక్కింది మీరు కాదా?

తెలంగాణ రాగానే టీవీ ఛానళ్ల మీద నిషేదం విధించారు. మీరు మీడియా సంస్థలనులొంగదీసుకోవడం వాస్తవం కాదా. కెసిఆర్ స్క్రిప్ట్ ను చూపిస్తున్న ఛానళ్ళు లేవా? అని ప్రశ్నించారు. మీడియాను కూడా మీ గుప్పిట్లో పెట్టుకొని మళ్లీ ప్రజాస్వామ్యం కాపాడండి అంటూ అప్పీల్ చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

తీన్మార్ మల్లన్న 60 రోజులు , రఘు 30 రోజులు జైల్లో పెట్టారు. కాళోజీ టీవీ దాసరి శ్రీనివాస్ ను పోలీస్ స్టేషన్ లో పెట్టీ చిత్రహింసలు పెట్టారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టారు. హుజూరాబాద్ లో ఓటుకి ఆరువేల రూపాయలు పంచడం ఓటుకు నోటు కాదా ?అప్పుడు సీఎం మీద కేసు పెట్టొద్దా ? అని ప్రశ్నించారు.

మునుగోడులో ప్రలోభాలు, బెదిరింపులు నిజం కాదా?

మునుగోడులో ప్రలోభాలు, బెదిరింపులు నిజం కాదా?

కేటీఆర్ 30 వేల ఓట్ల మీద కన్నేసి 2 వ తేదీ ఎల్బీ నగర్ లో మీటింగ్ పెట్టీ లాండ్ రెగ్యులర్ చేస్తాను అని హామీ ఇచ్చారు ఇది ప్రలోభం కాదా ?అని ప్రశ్నించారు. ఒక తండా వాసులకు కేటీఆర్ ఫోన్ చేసి మాకు ఓట్లు వేయండి అభివృద్ది చేస్తా అని చెప్పడం కరెక్టా? నాకు ఓట్లు వెయ్యండి.. గాడిదలకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా? అని సీఎం మాట్లాడతారా?డాన్సులు, ధావత్ ల తో ప్రజాస్వామ్యాన్ని అవమానించ లేదా అని ప్రశ్నించారు.

కెసిఆర్ ఎమ్మార్వోలకు, ఎంపీడీఓలకు లకు ఫోన్ చేసి మా పార్టీకి పనిచేయకపోతే మీ సంగతి చూస్తా అని బెదిరించడం ఏం ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నించారు ఈటల రాజేందర్. పోలింగ్ కు 36 గంటల ముందే మమ్మల్ని మునుగోడు నుండి బయటకు పంపించి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మునుగోడు లోనే ఉండి ఓటర్లను ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకున్న ది నిజం కాదా అంటూ ప్రశ్నించారు

ఇది నీ జాతి, నీ నీతి కేసీఆర్ : భగ్గుమన్న ఈటల

ఇది నీ జాతి, నీ నీతి కేసీఆర్ : భగ్గుమన్న ఈటల


నా భార్య జమున వాళ్ళ అమ్మగారింటిలో ఉంటే మహిళ అని కూడా చూడకుండా అర్థరాత్రి బయటకు పంపించారు.ఇది నీ జాతి,నీ నీతి అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ఉంటే రాళ్ల దాడి చేయడం ప్రజాస్వామ్యమో చెప్పాలన్నారు. చట్టాలను చట్టుబండలు చేసి, అధికారులను బానిసలుగా మార్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసింది కెసిఆర్ మాత్రమేనని విరుచుకుపడ్డారు.

మునుగోడులో ఓడిపోతామని తెలిసే కేసీఆర్ కుట్రలు

మునుగోడులో ఓడిపోతామని తెలిసే కేసీఆర్ కుట్రలు

కేసీఆర్ చిల్లర పనులు చేస్తున్నారని, కెసిఆర్ దగ్గర బానిసలుగా ఉంటేనే ఉండాలని, ఆత్మగౌరవంతో ఉండేవారు ఉండడానికి వీల్లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సామాజిక స్పృహ ఉన్న వారు ఎవరూ కేసీఆర్ మంచివాడని అనరని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయి అస్వతంత్రంగా వ్యవహరించడం బాధాకరమని ఈటల తెలిపారు. మునుగోడులో ఓడిపోతానని తెలిసే కెసిఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలంటూ కొత్త డ్రామా అల్లాడని మండిపడ్డారు. కెసిఆర్ నైతికంగా ఓడిపోయాడని ఈటల రాజేందర్ తేల్చిచెప్పారు.

English summary
Etela Rajender targeted KCR. Etela asked that those MLAs are very generous and also slams KCR is talking about democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X