గట్టిగా పిండేసిన సీఎం రేవంత్ రెడ్డి?
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ పైన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి విధించిన షరతులు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయని ఆయన అభివర్ణించారు. రుణమాఫీ పై విధించిన నిబంధనలు రైతాంగాన్ని వంచనకు. మోసానికి గురిచేసేలా ఉన్నాయని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు.
అడ్డదారులు అధికారం కోసమే ...
రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నా ఎన్నికలకు ముందు అన్ కండిషనల్ గా రుణమాఫీ చేస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. లేదంటే ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారంలోకి రావాలనుకుంది కాబట్టి ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.

దగా పడిన రైతులు
రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోయాం, దగాపడ్డామని అనుకుంటున్నారని పేర్కొన్నారు. 34 వేల కోట్ల రూపాయలు రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నిబంధనల పేరుతో మేము ఇవ్వమని చెప్పకనే చెబుతున్నారని, అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కాకముందే ఏడు రకాల అవతారాలు ఎత్తుతున్నారని మండిపడ్డారు.
ఆవురావురుమని దండుకుంటున్నారు
పదేళ్లపాటు అధికారంలో లేకపోయేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఆవురావురుమని ప్రజా దానం దండుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని శాపనార్థాలు పెట్టారు. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వీడియోలను చూపించి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏమిటి అంటూ ప్రశ్నించారు. మాట ఇచ్చి తప్పిన వారికి ప్రజలు కచ్చితంగా కర్రి కాల్చి వాత పెడతారని గుర్తు చేశారు.

కేసీఆర్ కు పట్టిన గతే మీకు
కేసీఆర్ విశ్వసనీయత లేని నాయకుడని రాజకీయంగా ఆయనను బొద్దపట్టారని రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అద్దాల మేడలో కూర్చొని ఐదేళ్లపాటు అధికారం ఉందన్న అహంకారంతో వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి తన మాటలు ప్రజలు నమ్మాలని దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తీరా గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజలను అడుగడుగున మోసం చేస్తున్నారని ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. ప్రజలను మోసం చేసి ప్రజా ధనాన్ని గట్టిగా పిండేస్తున్నారని టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications