చంద్రబాబు బయటకు వచ్చాక కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం జరుగుతుంది: ఈటల రాజేందర్
రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం తథ్యమని, నేతలు పార్టీలు మారుతూ ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ తెలంగాణ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ తీరుపైన, కాంగ్రెస్ నేతల తీరుపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావద్దన్నారు. మళ్లీ కెసిఆర్ అధికారంలోకి వస్తే ప్రజలు బ్రతికి బట్టి బట్టకట్టరు.. అనే అభిప్రాయంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా అనేక విషయాల మీద అదరగొట్టిన కేసీఆర్ కాలేశ్వరం మీద సమాధానం చెప్పడం లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఎలా మోసం చేశారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందన్నారు .

కచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈసారి ఆ పార్టీని, కేసీఆర్ ను బంగాళాఖాతంలో ముంచటం ఖాయం అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం జరుగుతుందని ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర అంతా కూడా కళ్ళ ముందు కదలాడుతుంది.
ఇదేం కొత్త పార్టీ కాదు. ఇవాళ కొంతమంది చేరుతున్నప్పుడు కొంత పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదని ఈటల రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే టీఆర్ఎస్ లో కలిపేసిన చరిత్రని ఆయన గుర్తు చేశారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా మనం వద్దనుకుంటున్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కేఅవకాశం ఉందన్నారు.
కెసిఆర్ కోసం ఎవరు ఎన్ని రాతలు రాసిన.. ఎవరు ఎన్ని కథనాలు వేసినా నూటికి నూరు శాతం తెలంగాణ ప్రజలు, నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళలు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని భావనతో ఉన్నారన్నారు .కాబట్టి బరిగీసి కొట్లాడే, మంచి పరిపాలన అందించే శక్తి, సత్తా.. భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని బిజెపిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications