హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ వివరాలు బయటపెట్టే దమ్ముందా?: కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్రాన్ని దూషించే స్థాయికి దిగజారానని విమర్శించారు. సీఎం పదే పదే ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ మంచి జరిగితే తన ఖాతాలో.. చెడు జరిగితే ఇతరులపై నెట్టివేస్తారని ఈటల రాజేందర్ విమర్శించారు. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయడం మంచిది కాదని హితవు పలికారు. కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో 14 శాతం రాష్ట్రాలకు పంచుతుందని ఆయన తెలిపారు.

రాష్ట్రాల పారా మీటర్ ఆధారంగానే బడ్జెట్ కేటాయించుతుంది తప్పితే.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక విధంగా లేిన చోటు మరో విధంగా కేంద్రం కేటాయించదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బడ్జెట్ పేపర్‌లో ఎక్కువ పెట్టుకుని కేంద్రం తక్కు ఇస్తోందని బద్నాం చేస్తున్నారని కేసీఆర్ సర్కారుపై ఈటల రాజేందర్ మండిపడ్డారు.

Etela Rajender slams KCR for heavy debt of telangana state

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. డబ్బులు పంచే ప్రభుత్వం గొప్పది కాదని.. ఉపాధి, సంక్షేమ పథకాలు కల్పించాలన్నారు ఈటల.

తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని.. దమ్ముంటే తెచ్చిన అప్పుు, ఖర్చు, కేటాయింపులు, జీవోలను వెబ్ సైట్లో పెట్టాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద తాము బతకడం లేదని.. కేంద్రమే తమపై ఆధారపడి బతుకుతుందని చెప్పడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.

English summary
Etela Rajender slams KCR for heavy debt of telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X