హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతి హిందువు నలుగుర్ని కనాలి: స్వామిగౌడ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. లేనిపక్షంలో హిందు జాతి తగ్గిపోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కౌండిన్య సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ మంజుల అనగానికి ఆదివారం రాత్రి బషీర్‌బాగ్‌ దేశోద్ధారకభవన్‌లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానకి ముఖ్యఅతిథిగా హాజరైన స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. ‘చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం' అనే అందమైన నినాదంతో హిందూ జాతి తగ్గిపోయే ప్రమాదముందన్నారు. ఒకరు పది మంది సంతానం కంటుంటే, మరొకర్ని ఇద్దరికే పరిమితం చేయాలని కోరడం ఏం పద్ధతని ప్రశ్నించారు.
ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన వారి చరిత్రను తొక్కిపెట్టారని.. సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ చరిత్ర దీనికి నిదర్శనమని చెప్పారు.

Every hindu should give birth to four children says Swamy Goud

జ్యోతిరావు పూలే హిందూ మతంలో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. గ్రామాల్లో నేటికీ కులవ్యవస్థ వేళ్లూనుకునే ఉందని, 60 ఏళ్ల నాటి పరిస్థితులేమీ మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎంతోమంది మహనీయులను విస్మరించారని అన్నారు.

పూలే విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలనీ, ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. బిజెపి ఎమ్మెల్యే కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బహుజనుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణకు పూలే జీవిత చరిత్ర అత్యవసరమన్నారు. 85 శాతం ఉన్న బహుజనులను విస్మరిస్తే మరో రాజకీయ పోరాటం తప్పదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల నాగేశ్వర్‌రావు, యోగాచార్య ఉయ్యూరు కృష్ణమూర్తి, వెంకటేశ్వర్‌రావు, కె.జంగంరావుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సందర్భంగా మహత్మా జ్యోతిరావు పూలే స్మారక పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

English summary
Telangana Legislative Council Chairman Swamy Goud on Sunday said that every hindu should give birth to four children says Swamy Goud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X