5వేల మంది యువతులపై వలవేసిన కామ పిశాచి ఇతడే: ఇంట్లో కండోమ్స్, పిల్స్ లభ్యం (ఫోటోలు)
హైదరాబాద్: ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ముసుగులో ఓ కామ పిశాచి ఐదు వేల మంది యువతులకు వల వేశాడు. ఇందులో 300 మందిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. బయటకు చెప్తే తనతో ఉన్న ఫొటోలు నెట్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. షీ టీమ్స్‌కు వచ్చిన ఒక ఫిర్యాదుతో పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ బాగోతం బయటపడింది.
అతడి ఇంట్లో పోలీసులు సోదాలు చేసినప్పుడు... పదుల సంఖ్యలో గర్భ నిరోధక మాత్రల డబ్బాలు (ఐ పిల్స్), ఐదువేల మంది అమ్మాయిలతో ‘డేటా బ్యాంక్', పెద్దసంఖ్యలో సెల్‌ఫోన్లు బయటపడ్డాయి. ఈ సైకో సంగతులను శుక్రవారం హైదరాబాద్ అడిషనల్ పోలీసు కమిషనర్ స్వాతి లక్రా మీడియాకు తెలిపారు.
ఈ సైకో అసలు పేరు కలబంద మధు. వయసు 33 సంవత్సరాలు. స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. నల్లగొండలో 2007లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరాడు. 2011లో హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు.
బుద్ధి పెడదారిపట్టడంతో... ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. నగరం చేరాక అతడిలోని వికృత మనస్తత్వం బయటపడింది. లైంగిక అవసరాలు తీర్చుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. నాగోలు సమీపంలోని బండ్లగూడ, సాయినగర్‌కాలనీలో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు.
యూనివర్సిటీలో చదివిన అనుభవం ఉండడంతో వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇంటర్‌నెట్‌లోని ఆయా విద్యాసంస్థల వెబ్‌సైట్ల నుంచి తెలుసుకున్నాడు. కొత్తపేటలోని ఇండియన్ ఇంటర్‌నెట్ పాయింట్‌కు వెళ్లి అక్కడ శివ అనే ఆపరేటర్ సహాయంతో కొత్తగా ఇంటర్‌లో చేరిన వారి ప్రొఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు.

5వేల మంది యవతులపై వలవేసిన కామ పిశాచి ఇతడే
ప్రొఫైల్స్‌ను చూసి యువతులకు ఫోన్ చేసి వారి విద్యార్హతను బట్టి, తాను ఒక మంచి ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌గా నమ్మిస్తున్నాడు. వారి మాటలను బట్టి ఒకటికి పదిసార్లు ఫోన్ చేసి కార్యాలయానికి రావాలని కోరేవాడు. పదిసార్లు ఫోన్ చేసేసరికి అతడు చెప్పే మాటలు నిజమేనని.. నమ్మి అతడు చెప్పినట్లు చేసేవారు. తన వలలో పడ్డారని నమ్మకం వచ్చిన తర్వాత బండ్లగూడలోని తన కార్యాలయానికి రావాలని సూచించేవాడు.

5వేల మంది యవతులపై వలవేసిన కామ పిశాచి ఇతడే
అలా వెళ్లిన వారికి వారి పరిస్థితిని బట్టి పాస్ చేయిస్తామని, ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి లొంగదీసుకునేవాడు. ఇలా 300 మంది వరకు అమ్మాయిలను లొంగదీసుకొని, వారిని అనుభవించాడని పోలీసులు తెలిపారు. ఇది ప్రాథమిక సమాచారమేనని, బాధితులు ముందుకు వస్తే మరిన్ని వివరాలు బయటపడుతాయని పేర్కొన్నారు. చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదన్నారు.

5వేల మంది యవతులపై వలవేసిన కామ పిశాచి ఇతడే
రిజిస్టర్‌లోని ప్రొఫైల్స్‌లో కొన్ని పేర్లకు డేంజర్ అని, మరికొన్నింటికి వేస్ట్, ఇంకా కొన్నింటినికి ఓవర్ అని రాసుకున్నాడు. ఫోన్ చేసినప్పుడు సరిగా మాట్లాడకుండా, రెండు మూడుసార్లు ఫోన్ చేసినప్పుడు తిట్టేవారికి డేంజర్ అని, ఫోన్‌చేసినా మాట్లాడకపోవడం, అందంగా లేకపోయినా వేస్ట్ అని, ఇతడి చేతిలో వంచనకు గురైన వారి పేర్లకు ఓవర్ అని రాసుకున్నాడని పోలీసులు తెలిపారు.

5వేల మంది యవతులపై వలవేసిన కామ పిశాచి ఇతడే
ఇతడిపై 2013లో సైఫాబాద్, 2014లో హయత్‌నగర్, కుషాయిగూడ పోలీస్‌స్టేషన్లలో కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో అతడిపై పుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సస్పెన్షన్ వేటు వేసింది. సైఫాబాద్‌లో గతంలో ఒక యువతిని బ్లాక్ మెయిల్ చేసి బంగారం తీసుకున్న కేసులో జైలుకెళ్లి వచ్చాడు. తాజాగా ఇతడిపై గాంధీనగర్, బోయిన్‌పల్లి, సీసీఎస్ సైబర్‌క్రైమ్‌లో కేసులు నమోదయ్యాయి.

5వేల మంది యవతులపై వలవేసిన కామ పిశాచి ఇతడే
ఇటీవల ఇద్దరు బాధిత విద్యార్థినులు మధుపై ‘షీ' టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల ఫిర్యాదు వచ్చాక నిందితుడిని గుర్తించి, పట్టుకోవటానికి పోలీసులు నానాతంటాలు పడ్డారు. ఇందుకు సుమారు 3 నెలల వ్యవధి పట్టిందని సమాచారం. ఎట్టకేలకు మధును పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు.

5వేల మంది యవతులపై వలవేసిన కామ పిశాచి ఇతడే
మధు అద్దెకు తీసుకున్న ఇళ్లలో గర్భనిరోధక మాత్రల (ఐ పిల్స్) బాక్సులు కుప్పలుగా లభించాయి. వీటిలో చాలా వరకూ ఖాళీగా ఉన్నాయి. అమ్మాయిలకు రాసేందుకు కొనిపెట్టుకున్న పోస్టు కార్డులు వందల సంఖ్యలో అక్కడ దొరికాయి. ఇక డెస్క్‌టాప్ కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, ఒక హార్డ్‌డిస్క్, 19 మొబైల్ ఫోన్లు, 13 లెడ్జర్లు, రెండు బైక్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

5వేల మంది యవతులపై వలవేసిన కామ పిశాచి ఇతడే
మధుపై 2013లోనే హయత్‌నగర్, కుషాయిగూడ, సైఫాబాద్ పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. మధుపై పీడీ యాక్టు ప్రయోగించే యోచనలో ఉన్నట్లు స్వాతి లక్రా తెలిపారు. ఉద్యోగం, ఉన్నత విద్య పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా, మెయిల్ ద్వారా తెలిపినా తల్లిదండ్రులకు సమాచారం అందించాలని యువతులకు సూచించారు.

5వేల మంది యవతులపై వలవేసిన కామ పిశాచి ఇతడే
91547 21308, 78049. 96183 72501, 77940 89157, 81870 26075, 91545 19527, 8019642075, 7075463017, 98492 36478, 80196 48205, 81795 26248, 90631 81156, 73963 25864 ఈ నెంబర్ల మధు వలలో చిక్కిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆమె వివరించారు.
ఇలా ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ, ఓయూసెట్-2015కు దరఖాస్తు చేసుకున్న యువతులకు సంబంధించిన 5వేల ప్రొఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేశాడు. వాటిలోని ఫోన్ నెంబర్లను తీసుకొని ఒకో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కు ఒకో రిజిస్టర్ తయారుచేశాడు. చైతన్యపురిలో రోడ్డుపై సిమ్‌కార్డులు విక్రయించే వారి నుంచి బింగి మహేశ్వరి అనేపేరుతో నకిలీ పత్రాలు ఇచ్చి 5 సిమ్‌కార్డులు పొందాడు.
పంజాగుట్ట చౌరస్తాలోనూ నకిలీ ధ్రువపత్రాలతో గజ్జల్వార్ సతీశ్ పేరుతో 7 సిమ్‌కార్డులు తీసుకున్నాడు. ఈ సిమ్‌కార్డులతో ఐదు వేల మందికి ఫోన్లు చేస్తూ.. ఒక్కోపేరుతో వారితో మాట్లాడుతున్నాడు. ఇలా సతీశ్, శ్రీనివాస్, రవి, వెంకట్‌రెడ్డి, వెంకట్ అనే పేర్లతో మాట్లాడేవాడు.












Click it and Unblock the Notifications