కేఎల్ఆర్ హైకమాండ్ మార్గదర్శకం, టార్గెట్ ఫిక్స్ - కేడర్ సమాయత్తం..!!
కాంగ్రెస్ సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నారు. గతంలో మేడ్చల్ నుంచి పోటీ చేసిన కేఎల్ఆర్ ఈ సారి మూడు నియోజకవర్గాల పైన ఫోకస్ చేసారు. కాంగ్రెస్ హైకమాండ్ తో సత్సంబంధాలు కలిసి రానున్నాయి. పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ సిద్దమని కేఎల్ఆర్ స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా మూడు నియోజకవర్గాల్లో కేఎల్ఆర్ కు పట్టు ఉండటంతో స్థానం హైకమాండ్ ఖరారు చేయాల్సి ఉంది.
మూడు నియోజవకర్గాలపై గురి:కేఎల్ఆర్ గతంలో మేడ్చల్ ఎమ్మెల్యేగా 2009లో గెలుపొందారు. 69,312 ఓట్లు ఆ ఎన్నికల్లో సాధించారు. 2018లో 79,334 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

కేఎల్ఆర్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు కేఎల్ఆర్ ఉమ్మడి రంగారెడ్డిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పైన ఫోకస్ పెట్టారు. ఈ సారి ఎన్నికల్లో సీట్ల ఖరారు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతీ సీటు కీలకంగా భావిస్తోంది. దీంతో..పార్టీ హైకమాండ్ సూచనల మేరకు కేఎల్ఆర్ పార్టీ కేడర్ ను ఎన్నికల దిశగా జోష్ పెంచే ప్రయత్నాలు ప్రారంభించారు.
కేడర్ తో కలిసి:తాజాగా నగరంలో బోనాల ఉత్సవాల సమయంలో బాలాజీ నగర్ మహంకాళీ ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సారి ఎన్నికల్లో గతంలో పని చేసిన మేడ్చల్ లో పాటుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం పైన కేఎల్ఆర్ ఫోకస్ పెట్టారు.
పార్టీ ఎక్కడి నుంచి బరిలోకి దిగమంటే అక్కడ పోటీకి సిద్దమని కేఎల్ఆర్ చెబుతున్నారు. అందులో భాగంగా మహేశ్వరంలో మంత్రిగా ఉన్నా అక్కడ సబితా మౌళిక సౌకర్యాల కల్పనలో విఫలమయ్యారనే అభిప్రాయం ఉంది. దీనిని పార్టీకి అనుకూలంగా మలచేందుకు కేఎల్ఆర్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లా తాండూరులో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన పైలటె్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఓటు వేస్తే బీఆర్ఎస్ లోకి వెళ్లటం పైన నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.
300ల బైకులతో ర్యాలీగా వెళ్లి మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నేత కిచ్చెనగారి లక్ష్మారెడ్డి..!! pic.twitter.com/G3VuVFOKFj
— oneindiatelugu (@oneindiatelugu) July 17, 2023
హైకమాండ్ సూచనల మేరకు:తాండూరులో మాజీ మంత్రి పట్నం మహీందర్ రెడ్డి..పైలెట్ రోహిత్ రెడ్డి మద్య వార్ నడుస్తోంది. ఇద్దరూ బీఆర్ఎస్ నేతలే అయినా వారిద్దరి ఆధిపత్య పోరులో నియోజకవర్గం నష్టపోతోంది. దీంతో, అక్కడ ఎలాగైనా కాంగ్రెస్ ను గెలిపించి పార్టీకి నష్టం చేసిన రోహిత్ రెడ్డికి జలక్ ఇవ్వాలనేది కార్యకర్తల అభిప్రాయం.
దీంతో అక్కడ బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపాలనేది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన. బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ బిగ్ షాట్స్ పైన ఫోకస్ చేసిన కాంగ్రెస్..కేఎల్ఆర్ ను ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ నుంచి పోటీకి దింపుతుందనేది తేలాల్సి ఉంది. జిల్లా పరిధిలో తనకున్న అనుచరగణంతో ముందుగా పార్టీ గెలుపు కోసం పని చేస్తున్నామని..హైకమాండ్ ఏం చెబితే అది చేసేందుకు సిద్దమని కేఎల్ఆర్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications