మనల్ని ఎవడ్రా ఆపేది.. కట్ చేస్తే 261 లిక్కర్ బాటిళ్లు సీజ్

సంక్రాంతి సందడి వేళ ఎలాంటి ఇబ్బంది రాకూడదని భావించిన నిర్వాహకులు... అతిథులకు ఘనంగా విందు ఏర్పాటు చేశారు. భారీగా మద్యం బాటిళ్లు తెప్పించి, ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతులు కూడా తీసుకున్నారు. ఇక కార్యక్రమం సాఫీగా సాగుతుందని అందరూ భావించిన క్షణంలోనే ఎక్సైజ్ అధికారుల దాడి జరగడంతో ఫంక్షన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెచ్చుకున్న మద్యం మొత్తం స్వాధీనం కాగా, నిర్వాహకులపై కేసులు నమోదు కావడంతో ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటన సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సిక్కు విలేజ్‌లో ఉన్న ఇంపీరియల్ గార్డెన్‌లో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి అక్కడ నిర్వహించిన ప్రైవేట్ ఫంక్షన్‌కు పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. వారికి మద్యం విందు ఏర్పాటు చేసిన నిర్వాహకులు, ఈవెంట్ నిర్వహణకు అవసరమైన అనుమతులు ముందుగానే పొందినట్లు తెలిపారు. అయితే ఫంక్షన్‌లో వినియోగిస్తున్న మద్యం తెలంగాణకు చెందిందా అనే అంశంపై ఎక్సైజ్ అధికారులకు అనుమానం రావడంతో రైడ్ కు సిద్ధమయ్యారు.

261 Liquor Bottles Seized Despite Event Permission

ఫంక్షన్‌లో వినియోగించిన మద్యం తెలంగాణది కాదని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌గా గుర్తించారు. ఎయిర్‌పోర్ట్ డ్యూటీ ఫ్రీ షాపులు, గోవా నుంచి తక్కువ ధరకు తెచ్చిన మద్యాన్ని ఫంక్షన్‌లో సప్లై చేసిట్లు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎక్సైజ్ సీఐ జగన్మోహన్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఫంక్షన్ ప్రాంగణంపై దాడి నిర్వహించారు.

ఈ దాడుల్లో మొత్తం 261 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎయిర్‌పోర్ట్ నుంచి తెచ్చిన డ్యూటీ ఫ్రీ మద్యం, గోవా నుంచి తరలించిన మద్యం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆశ్చర్యకరంగా, స్వాధీనం చేసిన మద్యాల్లో కేవలం రెండు బాటిళ్లే తెలంగాణకు చెందినవిగా గుర్తించారు. పట్టుకున్న మద్యం విలువను సుమారు రూ.8.15 లక్షలుగా అంచనా వేశారు.

మద్యం తరలింపుకు ఉపయోగించిన ఆటో ట్రాలీని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పాడేరు శ్రీధర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా, ఫంక్షన్ నిర్వాహకుడికి సంబంధించిన వ్యక్తి శ్యామ్ జోసెఫ్‌పై కూడా కేసు నమోదు చేశారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను వినియోగించడం తెలంగాణ ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరమని అధికారులు స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులు కీలక స్పష్టత ఇచ్చారు. ఫంక్షన్ నిర్వహణకు ఈవెంట్ పర్మిట్ తీసుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో అనుమతించిన మద్యాన్నే వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను వడ్డించడం చట్టవిరుద్ధమని, ఈ విషయం తెలియకపోయినా చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. ఫంక్షన్లు, వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవడంతో పాటు తెలంగాణ మద్యాన్నే వినియోగించాలని ఆయన హెచ్చరించారు. సంక్రాంతి సంబరాలు ఒక్కసారిగా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలంటే నిబంధనలపై అవగాహన అవసరమని ఈ ఘటన స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+