• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైకోర్ట్ ఆవ‌ర‌ణ‌లో ఉద్వేగ ప‌రిస్థితులు..! ఓ ప‌క్క ఆందోళ‌న‌., మ‌రో ప‌క్క ఆనందం..!!

|

హైద‌రాబాద్ : ప్ర‌శాంతంగా ఉండాల్సిన హైకోర్ట్ ప్రాంగ‌ణంలో మ‌రోసారి ఉద్వేగ ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. న్యాయం చెప్పాల్సిన న్యాయ‌వాదులే న్యాయం కోసం రోడ్డెక్కిన ప‌రిణామాలు క‌నిపించాయి. హైకోర్ట్ విభ‌జ‌న‌తో ఎక్క‌డి ఉద్యోగులు ఆ ప్రాంతానికి వెళ్లి పోవాల‌ని చెప్ప‌డంతో మ‌ళ్లీ క‌థ మొద‌టికొచ్చ‌న‌ట్టు తెలుస్తోంది. అమ‌రావ‌తిలో హైకోర్ట్ భ‌వ‌న నిర్మాణం ఇంకా పూర్తి కాలేద‌ని, క‌నీస మౌళిక వ‌సుతులు లేని ప్రాతంలో ఎలా విధులు నిర్వ‌హిస్తామ‌ని ఏపి లాయ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. హైకోర్ట్ విభ‌జ‌న జరిగిపోయింది కాబ‌ట్టి ఇక్క‌డినుండి ఏపి అడ్వ‌కేట్లు వెళ్లి పోవాల్సిందేన‌ని తెలంగాణ లాయ‌ర్లు డిమాండ్ చేస్తున్నారు.

 ఏపీలో పూర్తి కాని హైకోర్టు భవనం.! ఐనా ఉద్యోగులు రావాల్సిందే అంటున్న ఏపి..!!

ఏపీలో పూర్తి కాని హైకోర్టు భవనం.! ఐనా ఉద్యోగులు రావాల్సిందే అంటున్న ఏపి..!!

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనవరి ఒకటి నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నాయి. అమరావతి వేదికగా జనవరి నుంచి ఏపీ హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఏపీలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా నిర్మాణం సగంలోనే ఉంది. జవనరి 1కి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో కొత్త భవనంలో హైకోర్టు ఏర్పాటు దాదాపు అసాధ్యమంటున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత ఒకేసారి కార్యక్రమాలు మొదలుపెట్టాలన్న ఆలోచన ఉన్నా అప్పటికి కూడా హైకోర్టు తాత్కాలిక భవనం సిద్ధమవుతుందన్న గ్యారెంటీని ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది.

వ‌స‌తులు లేని ద‌గ్గ‌ర ఎలా విధులు నిర్వ‌హించాలంటున్న ఏపి లాయ‌ర్లు..! ఇవాళ‌ కీల‌క నిర్ణ‌యం..!

వ‌స‌తులు లేని ద‌గ్గ‌ర ఎలా విధులు నిర్వ‌హించాలంటున్న ఏపి లాయ‌ర్లు..! ఇవాళ‌ కీల‌క నిర్ణ‌యం..!

డిసెంబర్‌ 31కి హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రకటించినా ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో న్యాయవర్గాల ముందు ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టిందని తెలుస్తుంది. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తయ్యే వరకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని హైకోర్టు కోసం వాడుతామని ఏపీ ప్రభుత్వం సూచించిందనే వార్త వినపడుతుంది. హైకోర్టు తాత్కాలిక భవనం పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుందని, అందువల్లే అప్పటి వరకు సీఎం క్యాంపు కార్యాలయాన్ని హైకోర్టుకు వాడుకోవాల్సిందిగా ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది అని తెలుస్తుంది.

 హైకోర్ట్ విభ‌జ‌న‌తో సంబ‌రాల్లో తెలంగాణ లాయ‌ర్లు..! ఆందోళ‌న‌లో ఏపి లాయ‌ర్లు..!!

హైకోర్ట్ విభ‌జ‌న‌తో సంబ‌రాల్లో తెలంగాణ లాయ‌ర్లు..! ఆందోళ‌న‌లో ఏపి లాయ‌ర్లు..!!

మ‌రో ప‌క్క తెలంగాణ హైకోర్టు విభజన తో తెలంగాణ న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ కృషి తోనే తెలంగాణ రాష్ట్రం కు ప్రత్యేక హైకోర్టు వచ్చిందన్నారు న్యాయవాదులు. ఇక హైకోర్టు విభజనను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు ఏపీ న్యాయవాదులు. విధులు బహిష్కరించి కోర్ట్ హల్ లో నిరసన తెలిపారు. హైకోర్టు విభజనను వ్యతిరేకిస్తూ ఏపీ మహిళ న్యాయవాదులు కూడా ఉమ్మడి హైకోర్టు ముందు నిర‌స‌న చేసారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా విభజన చేయడం, వెంట‌నే ఏపిలో విధుల్లోకి హాజ‌ర‌కావాల‌ని కోర‌డం సరైంది కాదంటూ ఆందోళన చేసారు.

ఏపి ప్ర‌భుత్వం గ‌డ‌వు లోపు పూర్తి చేయ‌లేక పోయిన భ‌వ‌న నిర్మాణం..!

ఏపి ప్ర‌భుత్వం గ‌డ‌వు లోపు పూర్తి చేయ‌లేక పోయిన భ‌వ‌న నిర్మాణం..!

డిసెంబర్ 14 తేదీ లోపు హైకోర్టు ఏర్పాటు, మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామంటూ సుప్రీంకోర్టు లో ప్రభుత్వం అఫిడవిట్ ధాఖలు చేసింది. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతామ‌ని, అన్ని ఏర్పాట్లు చేసిన తరువాతే కోర్ట్ ను తరలించాలని ఏపి న్యాయ‌వాదులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చెప్పే వారే .. న్యాయం కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర విడిపోయినప్పుడే ఎదో ఒక రోజు వెళ్లాలని తాము భావించామ‌ని, కాని అక్కడ కనీస వసతులు లేకుండ ఎలా వెళ్తామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఐతే లాయ‌ర్ల అభ్యంత‌రాల‌పై నేటి సాయ‌త్రం జ‌ర‌గ‌బోయే స‌మావేశంలో సుప్రిం కోర్టు కొలీజియం ఓ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
In the Amravati, the High Court building construction is yet to be completed, and the lawyers question how to operate in the area where there is no minimum elementality. Telangana lawyer is demanding that the High Court division completed so the ap advocates have to go from here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X