వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ప‌ట్టు సాధించ‌డానికి, బీజెపి వెన‌క‌డుగు వేయ‌డానికి ఆ ప‌రిణామాలే కార‌ణ‌మా...?

|
Google Oneindia TeluguNews

కర్ణాట‌క‌లో ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ దాని మిత్ర‌ప‌క్షం జేడీయ‌స్ పార్టీలు బీజేపి పైన పై చేయి సాధించాయి. రాజ‌కీయ క్రీడ‌లో కాంగ్రెస్ చూపిన చ‌తుర‌త ముందు బీజేపి కుదేల‌య్యింది. బ‌లం నిరూపించుకుని ప్ర‌భుత్వం న‌డ‌పాల్పిన యెడ్యూర‌ప్ప అర్థాంత‌రంగా రేసు నుండి త‌ప్పుకుంటున్న‌ట్టు నిండు స‌భ‌లో ప్ర‌క‌టించారు. దీంతో గ‌త వారం రోజులుగా కొన‌సాగుతున్న క‌ర్ణాట‌క ఉత్కంఠ రాజ‌కీయాల‌కు తెర‌ప‌డిన‌ట్ట‌యింది.

 అక‌స్మాత్తుగా నిర్ణ‌యం తీసుకున్న బీజేపి అదిష్టానం..

అక‌స్మాత్తుగా నిర్ణ‌యం తీసుకున్న బీజేపి అదిష్టానం..

కర్ణాటక రాజకీయం అకస్మాత్తుగా కీలక మలుపు తిరిగింది. టీట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో చివరి బంతి ఫలితాన్ని తేల్చినట్టు.. చివరి నిమిషంలో యెడ్యూరప్ప రాజీనామా చేస్తున్నట్టు ప్రకంటించి సంచలనం రేకెత్తించారు. బల పరీక్షలో గెలిచేది మేమే., సంబరాలు చేసుకునేది మేమే అని ప్రకటించి 24గంటలు గడవక ముందే ప్రభుత్వంనుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించి కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని నింపారు. కర్ణాటక ప్రజలు బీజెపి కి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని చెప్పుకున్న యెడ్యూరప్ప ఆండ్ కో తర్వాత ప్రభుత్వం మాదే అని సంబరపడిపోయారు. ఉత్కంఠ పరిస్థితుల మధ్య ప్రోటెం స్పీకర్ ని నియమించుకుని ప్రభుత్వం ఏర్పాటు దిశగా పావులు కదిపారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాల వరకు హుందాగా కనపడిని కర్ణాటక కమల నాథులు ఒక్కసారిగా డీలా పడిపోయారు. కార్ణాటక బీజెపి రాజకీయం ఒక్కసారిగా మారిపోవడానికి కారణమేంటి.? బలపరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని నడిపిస్తామన్న ధీమా ఎందుకు డీలా పడింది.? కర్ణాటక బీజెపిలో అకస్మాత్తుగా రాజకీయం ఎందుకు మారిపోయింది.?

బీజేపి కొంప ముంచిన ఆడియో టేపులు..

బీజేపి కొంప ముంచిన ఆడియో టేపులు..

కర్ణాటక లో బీజెపి వెనకడుగు వేయడానికి కారణాలను విష‌దీకరిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం.. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాల తొలి ఘట్టం ముగిసాక సరిగ్గా మద్యాహ్న సమయంలో కంగ్రెస్ ఎమ్మెల్యే తో యెడ్యూరప్ప బేరసారాలంటూ ఆడియో టేప్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మీడియాకు విడుదల చేసిందో అప్పటి నుండి బీజెపి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. అంతకు ముందు రోజునుండే గాలి జనార్ధన్ రెడ్డి బేరసారాల ఆడియో టేప్ దేశ వ్యాప్తంగా సంచలనం కావడంతో బీజెపి అదిష్టానానికి ఏంచేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తప్పని సరి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ నకిలీ టేపులను స్రుష్టంచడంలో కాంగ్రెస్ పార్టీ ముందువరసలో ఉంటుందని, అలాంటి ఆడియో టేపులకు బీజేపి కార్యకర్తలు ఎవ్వరూ కలత చెందొంద్దని చెప్పుకొచ్చారు. ఆ ప్రకటన చేసి 12గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి యెడ్యూరప్ప గొంతుతో వచ్చిన ఆడియో టేప్ విడుదల కావడంతో బీజెపి అదిష్టానం ఆత్మరక్షణలో పడిపోయింది.

 గ‌వ‌ర్న‌న్ తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు కూడా బీజెపికి క‌లిసి రాలేదు.

గ‌వ‌ర్న‌న్ తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు కూడా బీజెపికి క‌లిసి రాలేదు.

అంతకు ముందు అత్యున్నత న్యాయ స్థానం తీర్పులు కూడా బీజేపి అగ్రనాయకత్వానికి అసహనం కలిగించాయి. కర్ణాటకలో బీజెపి ప్రభత్వ ఏర్పాటును అనైతికమని పలుసందర్బాల్లో గొంతెత్తి చాటిన కంగ్రెస్ పార్టీ అదే వాదనను ఇతర రాష్ట్రాలకు విస్తరించేట్టు చేసింది. దీంతో నాగాలాండ్, మణిపూర్, గోవా రాష్టాల్లో సింగిల్ లార్జెస్టు పార్టీగా గెలుపొందిన కాంగ్రేస్ ను కాదని., బీజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిచండం పట్ల ఆందోళన నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. కార్ణాటకలో ఒక న్యాయం ఇతర రాష్ట్రాల్లో ఒక న్యాయమా అంటూ బీజేపి ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. ఈ అంశం కూడా భార‌తీయ జ‌న‌తా పార్టీకి పంటికింద రాయిలా ప‌రిణ‌మించింది. అంతే కాకుండా ప్రోటెం స్పీక‌ర్ నియామ‌కం కూడా బీజెపి అదిష్టానానానికి కంటిమీద కునుకులేకుండా చేసింది. గ‌తంలో బోపయ్య చేసిన త‌ప్పిదాల‌కు కేంద్రం వేసిన మొట్టికాయ‌లు ఒక్క‌సారి వెలుగులోకి రావ‌డంతో బీజెపి అదిష్టానం ఖ‌గుతిన్నంతప‌నైంది. రాజ‌కీయ మేధావులు. త‌ట‌స్థ విశ్లేష‌కులు కూడా క‌ర్ణాట‌క‌లో అదికారం కోసం బీజేపి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను సున్నితంగా త‌ప్పుబ‌ట్టారు.

 బీజెపి ఎత్తుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా చిత్తు చేసిన కాంగ్రెస్..

బీజెపి ఎత్తుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా చిత్తు చేసిన కాంగ్రెస్..

గ‌తంలో ఇత‌ర రాష్ట్రాల్లో బీజేపి అనుస‌రించిన విధానాల‌ను తాజాగా క‌ర్ణాట‌క‌లో అనుస‌రిస్తున్న విధాల‌ను బేరీజు వేస్తూ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను బీజేపి భ్ర‌ష్టు ప‌ట్టిస్తోందంటూ విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. యెడ్యూర‌ప్ప బ‌ల‌నిరూప‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ వారం రోజులు గ‌డువు ఇవ్వ‌డం కూడా విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేలను ప్ర‌లోభాల‌కు, బేర‌సారాల‌కోస‌మే గ‌వ‌ర్న‌ర్ వారం రోజుల గ‌డువు ఇచ్చ‌రంటూ తారా స్థాయిలో విమ‌ర్శ‌లు వినిపించాయి. అంతే కాకుండా సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకుని బ‌ల నిరూప‌ణ‌కు రెండు రోజుల గ‌డ‌వు విధించ‌డం కూడా బీజెపికి ఎదురు దెబ్బ‌లా ప‌రిణమించింది. మొత్తానికి కర్ణాట‌క‌లో అదికారం చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర‌నుండి భార‌తీయ జ‌న‌తా పార్టీకి వివిద రూపాల్లో చేదు అనుభ‌వాలు ఎదురౌతూనే ఉన్నాయి. బీజేపి నేత‌లు చేస్తున్న త‌ప్పుల‌ను, ప్ర‌లోభాల‌ను ఆధారాల‌తో రుజువు చేసి కాంగ్రెస్ పార్టీ నైతిక విజ‌యాన్ని అందుకుంది.

హుందాగా త‌ప్పుకున్న బీజేపి.. ప్ర‌జాస్వామ్యం గెలిచింద‌న్న కాంగ్రెస్, జేడీయ‌స్..

గెలిచిన ఎమ్మెల్యేల‌ను త‌మ‌వైపు తిప్పుకోంకుండా హైద‌రాబాద్ త‌ర‌లించ‌డం, మ‌ళ్లీ రిసార్ట్స్ లో దాచిపెట్టుకోవ‌డం కూడా కాంగ్రెస్, జెడీయ‌స్ పార్టీల‌కు ప్ర‌జ‌ల్లో సానుభూతిని క‌లిగించాయి. చివ‌ర‌గా ఆడియో టేపుల‌తో అడ్డంగా దొరికిపోయినందుకు మూల్యం చెల్లించుకున్నారు బీజేపి అగ్ర‌నాయ‌కులు. కర్ణాట‌క అంశంలో మొండిగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌తిష్ట‌ను మ‌రింత దిగ‌జార్చుకునేక‌న్నా ముంద‌స్తుగా త‌ప్పుకుంటే హుందాగా ఉంటుంద‌ని భావించిన అదిష్టానం చివ‌ర‌కు ప్ర‌భుత్వం ఏర్పాటు నుండి నిష్క్ర‌మించింది. బీజెపి వేసిన వెన‌క‌డుగును ప్ర‌జాస్వామ్య విజ‌యంగా కాంగ్రేస్, జేడీయ‌స్ పార్టీలు అభివ‌ర్ణిస్తున్నాయి.

English summary
Dramatic changes have been took place in Karnataka assembly. before floor test the bjp cm Yeddyurappa resigned. the resignation of yeddyurappa causes unhappy in bjp cadre. the audio tapes which telecasted in the media have disappointed the bjp. and also the court verdicts also kept bjp in dilemma. finally bjp decides to quite from the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X