కాచిగూడ నుంచి తమిళనాడు టూర్ స్పెషల్ ట్రైన్
Kachiguda- Puducherry, Mahabalipuram special train: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరిలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కోస్టల్ ఛార్మ్ ఆఫ్ తమిళనాడు టూర్ ప్యాకేజీ ఇది. పుదుచ్చేరి, మహాబలిపురం పర్యాటక ప్రాంతాలను ఇందులో చేర్చింది ఐఆర్సీటీసీ (IRCTC).
మొత్తం నాలుగు రాత్రులు/ అయిదు పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుందీ ఎక్స్ ప్రెస్. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ను ఐఆర్సీటీసీ అందిస్తుంది. మిగిలిన రెండు పూటల భోజనాన్ని సందర్శకులే సొంతంగా భరించాల్సి ఉంటుంది.

ఒకరి నుంచి ముగ్గురు ప్రయాణికులు ఉంటే..
కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో.. ఇందులో సింగిల్ షేరింగ్ ఉండదు. డబుల్ షేరింగ్ ఛార్జీ ధర 19,810 రూపాయలు. ట్రిపుల్ షేరింగ్ కోసం 15,290 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బెడ్ తో కలిపి పిల్లలకు అంటే 5 నుంచి 11 సంవత్సరాల లోపు వారికి రూ. 11,620, బెడ్ లేకుండా రూ. 8,830లు.
స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో.. డబుల్ షేరింగ్ కోసం 17,660 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 13,130 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు 9,470 రూపాయలు, బెడ్ లేకుండా 6,670 రూపాయలు.
నలుగురి నుంచి ఆరుమంది ప్యాసింజర్లు ఉంటే..
కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో.. డబుల్ షేరింగ్ కోసం 16,140 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 13,790 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 11,620, బెడ్ లేకుండా రూ. 8,830లు.
స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో.. డబుల్ షేరింగ్ కోసం 13,990 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ధర 11,630 రూపాయలు. ఇందులో బెడ్ తో కలిపి పిల్లలకు రూ. 8,830, బెడ్ లేకుండా రూ. 6,670 రూపాయలను వసూలు చేస్తారు.












Click it and Unblock the Notifications