హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం: మూడో పెళ్లి చేసుకున్న బావ హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. జక్కుల గోపాల్‌ యాదవ్‌ అనే వ్యక్తి హత్యకు అదే కారణమని వెలుగు చూసింది. సోమవారం అర్ధరాత్రి దుండిగల్‌ గ్రామంలోని బర్రెల కొట్టంలో గోపాల్‌ యాదవ్‌ దారుణంగా హత్యకు గురయ్యాడు.

మృతుడి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గోపాల్‌యాదవ్‌ ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెకు గతంలో మరొక వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉంది. గోపాల్‌ యాదవ్‌తో ఆమె ఉండటం చూసిన ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు.
ఆమెకు దూరంగా ఉండాలని గోపాల్‌ను అతడు పలుమార్లు హెచ్చరించాడు. అయినా వినలేదు. దాంతో గోపాల్‌ను చంపాలని అనుకున్నాడు. సోమవారం రాత్రి సమీపంలో మద్యం తాగాడు. గోపాల్‌ చీటీ పాట పాడటా నికి వెళ్లిన విషయం గమనించిన నిందితుడు బర్రెలు తాళ్లు తెంపుకుని వెళ్లిపోతున్నాయని గోపాల్‌కు ఫోన్‌ చేశాడు.

Extra marital relation leads to the murder

బర్రెలను కట్టేసిన తీరు, అతడి రాకపోకలను దూరం నుంచి గమనించాడు. చీటీపాటకు వెళ్లిన అతడికి నిందితుడు రెండోసారి ఫోన్‌చేసి బర్రెలు మళ్లీ వెళ్లి పోతున్నాయని చెప్పాడు. కొట్టం వద్దకు వెళ్లిన గోపాల్‌ను పథకం ప్రకారం రాడ్డుతో తలపై కొట్టాడు. తీవ్రరక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

బావ హత్య కేసులో బావమరిది అరెస్టు

మూడో పెళ్లి చేసుకుని సోదరిని వేధిస్తున్న బావను హత్య చేసిన బామ్మర్దిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని హుమాయున్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఇన్‌ స్పెక్టర్‌ రవీందర్‌ వివరాలు వెల్లడించారు. మల్లేపల్లి ప్రాంతానికి చెందిన అజీమ్‌హుస్సేన్‌(35) స్థానికంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. 18 ఏళ్ల క్రితం అతడి సోదరికి కార్డియాలజిస్ట్‌ మిరాజ్‌తో వివాహం జరిగింది.

అప్పటికే పెళ్లయిన డాక్టర్‌ మిరాజ్‌ మొదట భార్య నుంచి విడాకులు పొందాడు. ప్రస్తుతం వారికి ముగ్గురు పిల్లలు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 2-3 నెలలుగా గొడవలు తీవ్ర రూపం దాల్చాయి. ఇటీవల మిరాజ్‌ మరో యువతిని మూడోపెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య ఘర్షణ పెరిగింది.

పుట్టింటికి చేరిన ఆమె జరిగిన విషయం తన సోదరుడు అజీమ్‌హుస్సేన్‌‌కు చెప్పింది. దీంతో అతను మల్లేపల్లి ఆస్పత్రిలో ఉన్న బావ వద్దకు చేరాడు. కొద్ది సేపు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత బయటకొచ్చిన అజీమ్‌ ఆయుధంతో మరోసారి ఆస్పత్రికి వెళ్లాడు. బావ మిరాజ్‌పై కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో మిరాజ్‌ అక్కడికక్కడే మరణించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An extra marital relation has lead to the murder of Gopal Yadav in Hyderabad of Telangana.
Please Wait while comments are loading...