వివాహేతర బంధానికి మరో వ్యక్తి బలి!

వివాహేతర సంబంధం మరో ప్రాణం తీసింది. కట్టుకున్న భర్తను కాదని.. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల భార్య ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన వైద్యుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చారు పోలీసులు.

హనుమకొండ జిల్లా కాజిపేటలో క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి కారులో ఇంటికి వెళ్తుండగా.. బైక్‌పై వెంబడించిన ఇద్దరు దుండగులు భట్టుపల్లి శివారులో ఆయనపై దాడి చేశారు. సుత్తితో తలపై మోదడంతో తీవ్రగాయాలయ్యాడు. ఆ తర్వాత నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు.

Extramarital affair Wife kills husband with boyfriend

తీవ్రగాయాలతో పడివున్న వైద్యుడిని గమనించిన స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల కిందట ఆయనను మళ్లీ ఎంజీఎంకు తీసుకురాగా.. మృతి చెందారు.

కాగా, సుమంత్ రెడ్డి హత్యకు భార్య వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా సహకారంతో ఆమె ప్రియుడు సంగారెడ్డికి చెందిన ఎర్రోళ్ల శామ్యూల్, అతడి స్నేహితుడు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మంచుకూరి రాజ్ కుమార్ లను నిందితులుగా గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే భర్తను తన ప్రియుడితో హత్య చేయించిందని తేలింది. దీంతో వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+