బ్యూటీషియన్ శిరీష మృతిపై కేసీఆర్‌కు నివేదిక, అందులో ఏముందంటే...

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫిలిం నగర్‌లో ఆర్జీఏ స్టూడియోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష ఘటనలో పోలీసు అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నివేదిక అందచేసినట్లుగా తెలుస్తోంది.

ముక్కోణపు ప్రేమకథ, రాజీవ్‌తో శిరీషకు వివాహేతర సంబంధం

ముఖ్యమంత్రికి అందజేసిన నివేదికలో శిరీషది అనుమానాస్పద మృతిగా పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక, విచారణలో లభించిన ఆధారాలతో శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించిన విషయం తెలిసిందే.

Facts about beautician Sirisha death

శిరీష ఆత్మహత్యకు ప్రధాన కారణం రాజీవ్, శ్రావణ్‌లు అని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చిన అనంతరం, మధ్యాహ్నం పోలీసులు ఈ కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

అనంతరం గురువారం మధ్యాహ్నం పోలీసులు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్యేనని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

శిరీషకు వల్లభనేని రాజీవ్ కుమార్‌తో శారీరక సంబంధం ఉందని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అయితే బెంగళూరుకు చెందిన తేజస్వి ఇటీవల రాజీవ్‌కు పరిచయం కావడం, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోవడంతో.. విభేదాలు వచ్చాయి.

రాజీవ్‌తో శిరీష సంబంధాన్ని ఆయనను పెళ్లి చేసుకోవాలనుకున్న తేజశ్రీ నిలదీసింది. దీనిపై గొడవ జరిగింది. సర్దుబాటు కోసం కుకునురుపల్లి వెళ్లారు. ఆ సమయంలో గొడవ జరిగింది. శిరీష పట్ల ఎస్సై అనుచితంగా ప్రవర్తించారు. ఆ తర్వాత రాజీవ్, శ్రవణ్ ఆమెను కొట్టడం, హైదరాబాదు వచ్చాక శిరీష ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the investigation into the murder of beautician Sirisha, the police have found out that the prime accused Rajiv, who is a photographer used to trap women.
Please Wait while comments are loading...