జైలు పరిచయంతో స్నేహం.. యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్ల ముద్రణ, చెలామణి: గ్యాంగ్ అరెస్ట్!!
ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని యూట్యూబ్ లో వీడియోలను చూసి నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాలలో చలామణి చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సహాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ మరియు సుబేదారి పోలీసులు పట్టుకున్నారు.
ఈ ముఠా నుండి ఆరు లక్షల రూపాయల విలువైన రెండు వేల రూపాయల నోట్లు, కలర్ ప్రింటర్, ఏడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాల తో పాటు, నకిలీ నోట్ల ముద్రణ అవసరమైన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జైల్లో పరిచయం.. గ్యాంగ్ గా ఏర్పడి నకిలీ నోట్ల దందా
నకిలీ నోట్ల ముద్రణ కు సంబంధించి హనుమకొండ, వరంగల్, కాజీపేట కు చెందిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సయ్యద్ యాకుబ్ అలియాస్ షకీల్, గడ్డం ప్రవీణ్, గుండా రజనీ గతంలో కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైలులో శిక్ష అనుభవించారు.
ఆ సమయంలో వీరికి దొంగ నోట్లు ముద్రించే ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. వారి ద్వారా దొంగ నోట్లను ముద్రించటం నేర్చుకున్న నిందితులు, జైలు నుండి విడుదల అనంతరం సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు.అందుకు రంగంలోకి దిగారు.

యూట్యూబ్ చూసి నకిలీ నోట్ల ముద్రణ
దీనితో నిందితులు అంతకు ముందే నేర చరిత్ర కలిగిన ఇతర నిందితులతో కల్సి నోట్ల తయారీకి శ్రీకారం చుట్టారు. తాము ముద్రించిన రెండు వేల నోటుపై ఎవరి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ముఠా యూట్యూబ్ వీడియోలను అనుసరించారు. ఒరిజినల్ రెండు వేల రూపాయల కాగితాన్ని పోలివుండే కాగితాలను కోనుగోలు చేసి నకిలీ నోట్లును ముద్రించేవారని సీపీ తరుణ్ జోషి తెలిపారు. నిందితులు ముద్రించిన నకిలీ నోట్లను రద్దీ వుండే వ్యాపార కూడళ్ళతో పాటు కిరాణ షాపులలో, బట్టలషాపు, మద్యం బెల్ట్ షాపు వద్ద వినియోగించి నకిలీ నోట్లను చెలామణి చేసేవారని అన్నారు.

వరంగల్ తో పాటు పక్క జిల్లాలలోనూ నకిలీ నోట్ల ముద్రణ
గత సంవత్సర కాలంగా నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల్లోను నకిలీ నోట్లను చెలామణి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వచ్చిన డబ్బుతో నిందితులు మద్యం సేవిస్తూ, జల్సాలు చేసేవారని పేర్కొన్నారు. ఇక సమాచారం మేరకు ప్రధాన నిందితుడు మరో నిందితుడు అవినాష్ తో కలిసి దొంగనోట్లను చెలామణి చేసేందుకు ద్విచక్ర వాహనంపై సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమల్ బార్ వద్దకు రాగా, పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

నకిలీ నోట్ల తయారీ గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు
నకిలీ నోట్లను చెలామణి చేసిన గ్యాంగ్ ప్రధాన నిందితులను విచారించగా వారి సమాచారంతో మిగితా నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి నకిలీ నోట్ల స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి లతోపాటు ఇతర పోలీసు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అభినందించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications