జాతీయ దర్యాప్తుసంస్థకు తప్పని నకిలీల బెడద.. నకిలీ ఎన్ఐఏ అధికారి అరెస్ట్.. అసలేం జరిగిందంటే!!
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కు నకిలీల బెడద తప్పడం లేదు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్న క్రమంలో, నకిలీలు ఎన్ఐఏ అధికారుల పేరుతో దోపిడీకి తెరతీశారు. తాము జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులమని బెదిరిస్తూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఎన్.ఐ.ఏ అధికారి పేరుతో ప్రజలను బెదిరిస్తూ డబ్బుల వసూళ్ళకు పాల్పడుతున్న నకిలీ ఎన్.ఐ.ఏ అధికారిని అరెస్ట్ చేసారు.

ఎన్ఐఏ అధికారి పేరుతో మోసం .. అరెస్ట్ చేసిన పోలీసులు
నిందితుడి నుండి పోలీసులు ఆర్మీ యూనిఫామ్, ల్యాప్ ట్యాప్, నకిలీ గుర్తింపు కార్డు, ఎయిర్ రైఫిల్, రెండు ద్విచక్రవాహనాలు, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ నల్లగొండ జిల్లా, అదిసర్లపల్లి మండలం, పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నార్ల నరేష్ ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం దూర విధ్యలో డిగ్రీ చదువుచున్నాడు. ఇదే సమయంలో జల్సాలకు అలావాటు పడిన నిందితుడు, సులభంగా డబ్బు సంపాదించాలని భావించాడు.

గతంలో నేవీ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం..
ఇందుకోసం నిందితుడు ఆర్మీ యూనిఫామ్, ఎయిర్ పిస్తోల్ ను కోనుగోలు చేయడంతో పాటు నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసుకోని గ్రామంలో ఆర్మీ పనిచేస్తున్నట్లుగా ప్రచారం కల్పించుకున్నాడు. నిందితుడు తన స్వగ్రామంలోని చదువుకున్న యువతకు నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఐదుగురు వ్యక్తుల నుండి ఐదు లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసి వారిని శిక్షణ పేరుతో మహరాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని వైష్ణవి కెరీర్ ఫౌండేషన్లో చేర్పించాడు. తాము మోసపోయినట్లుగా గుర్తించిన సదరు ఐదుగురు యువకులు నిందితుడి తల్లిదండ్రులను నిలదీయడంతో తమ కొడుకు చేతిలో మోసపోయిన యువకులకు వారు తిరిగి డబ్బులు ఇచ్చేశారు.

ఎన్ఐఏ అధికారినని ఇద్దరు వ్యక్తులకు బెదిరింపు
అక్కడితో ఆగని నిందితుడు మరోమారు ఇటీవల ఎన్.ఐ.ఏ దర్యాప్తు సంస్థ దేశంలో పి.ఎఎఫ్.ఐతో సంబంధం వున్న వ్యక్తుల ఇండ్లల్లో తనీఖీలు నిర్వహిస్తున్నట్లుగా ప్రసారమాధ్యమాల్లో చూసి నిందితుడు మరోమారు సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు నకిలీ ఎన్.ఐ.ఏ అధికారి పేరుతో మరో ఇద్దరు యువకులైన నేలపట్ల రాజేష్, బాబు లను పరిచయం చేసుకుని వారికి ఎన్.ఐ.ఏలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారితో కల్సి దందా మొదలుపెట్టాడు. నిందితుడు కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను పి.ఎఫ్.ఐతో సంబంధాలు వున్నాయని ఎయిర్ పిస్తోల్ తో బెదిరించి పెద్దమొత్తం డబ్బులను డిమాండ్ చేసాడు.

డబ్బుల కోసం నకిలీ ఎన్ఐఏ అధికారి అవతారం.. పట్టుకున్న పోలీసులు
డబ్బులు
ఇవ్వనిపక్షంలో
జైలుకు
పంపిస్తానని
బెదిరించిన
సంఘటలో
బాధితులు
పోలీసులకు
సమాచారం
ఇవ్వడంతో
కేసు
నమోదు
చేసుకున్న
పోలీసులు
దర్యాప్తు
చేపట్టారు.
దర్యాప్తులో
భాగంగా
పోలీసులు
అందుబాటులో
వున్న
టెక్నాలజీని
వినియోగించుకోని
నిందితుడిని
పోలీసులు
గుర్తించారు.
కెయుసి
పోలీసులు
కెయూసి
మొదటి
గేటు
వద్ద
వాహన
తనీఖీలు
నిర్వహిస్తుండ
నిందితుడు
ద్విచక్ర
వాహనంపై
వస్తున్న
క్రమంలో
పోలీసులు
నిందితుడుని
అపి
అతని
వద్ద
వున్న
బ్యాగు
తనీఖీ
చేయగా
దానిలో
ఆర్మీ
యూనిఫాం
,
ఎయిర్
పిస్తోల్
ను
గుర్తించిన
పోలీసులు
నిందితుడిని
అదుపులోకి
తీసుకోని
విచారించగా
నిందితుడు
పాల్పడిన
నేరాన్ని
అంగీకరించాడు.
గతంలోనూ
నిందితుడు
జగిత్యాల
జిల్లాలోను
ఇదే
తరహలో
నేరాలకు
పాల్పడినట్లుగా
అంగీకరించాడు.