చేతులెత్తి కోరుతున్నది ఒకటే.., టీవి9 'రవి ప్రకాశ్'పై ప్రచారం ఫేక్: శ్రీరెడ్డి

Subscribe to Oneindia Telugu
  ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయిలకి జరుగుతున్న అన్యాయం గురించి నా పోరటం

  హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో 'కాస్టింగ్ కౌచ్' బాగోతంపై శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్నవేళ.. కొంతమంది పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

  ఈ నేపథ్యంలోనే టీవి9 సీఈవో రవి ప్రకాష్‌పై బురద జల్లేందుకు సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ఫోటోలను సర్క్యులేట్ చేస్తున్నారని చానెల్ అసిస్టెంట్ మేనేజర్‌ కె. శ్రీనివాస్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు.

  fake photos of tv9 ceo with sri reddy circulating in social media?

  సినీనటి శ్రీరెడ్డితో రవిప్రకాశ్‌ అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంటూ కొన్ని స్క్రీన్ షాట్‌లు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. తమ సంస్థ సీఈవో రవి ప్రకాష్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు గుడ్ల శివకుమార్‌ అనే వ్యక్తి ఈ పోస్టు పెట్టాడని ఫిర్యాదులో చెప్పారు.

  నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు నటి శ్రీరెడ్డి సైతం దీనిపై స్పందించింది. రవి ప్రకాశ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆమె ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు.

  'ఎవరికి నచ్చినట్లు వారు ఏదేదో రాసేసుకుంటున్నారు, అందరిని నేను చేతులెత్తి కోరుతున్నది ఒకటే నేను చేస్తున్న పోరాటం ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయిలకి జరుగుతున్న అన్యాయం గురించి 'అని స్పష్టం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TV9 Assistant Manager K.Srinivas lodged a case on Gudla Shivkumar, for creating fake images of TV9 CEO to damage his image

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X