హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుచ్చిపోయిన ఆలు గడ్డలతో కల్తీ సాస్: పాతబస్తీలో గుట్టురట్టు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కల్తీ నూనె, కల్తీ పాలు, కల్తీ పప్పులు, కల్తీ పిండి, కల్తీ జీలకర్ర ఇలా తాజాగా ఈ జాబితాలో కల్తీ సాస్ వచ్చి చేరింది. జల్‌పల్లి చెరువు సమీపంలోని ఓ కంపెనీపై దాడి చేసిన సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు, మినార్ బ్రాండ్ పేరుతో పెద్ద ఎత్తున తయారు చేస్తున్న కల్తీ సాస్‌లను, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌వోటీ అధికారులు ఈ కంపెనీపై దాడి చేశారు. 833 కల్తీ సాస్‌ బాటిళ్లు, 390 కిలోల ఆలుగడ్డ, 360 కిలోల కచ్చా మెటీరియల్‌, 160 కిలోల రెడ్‌మిర్చీ, 360 కిలోల గ్రీన్‌ మిర్చీ.. అరకిలో సోడియం, రెండు మేకింగ్‌ మెషిన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కల్తీ సాస్‌ను తయారు చేస్తున్న సూపర్ వైజర్ ఆసిఫ్‌ అలీ, ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఆలుగడ్డలు ఉడకబెడ్తున్న రెండు గిన్నెలు, గ్యాస్‌ స్టౌ సిలిండర్‌తోపాటు ఖర్జూర పేస్ట్‌, క్యారెట్‌ పేస్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు రెడ్‌ చిల్లిసాస్‌, నాన్‌ఫ్రూట్‌, చిల్లీ వెనిగర్‌, టమోట సాస్‌, నాన్‌ ఫ్రూట్‌ వెనిగర్‌, డార్క్‌ సోయా సాస్‌, గ్రీన్‌ చిల్లి పేర్లున్న లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఈ కంపెనీకి అసలు అనుమతులే లేవని, పైగా కల్తీ సాస్‌ తయారు చేస్తున్నారని, విశ్వసనీయ సమాచారం మేరకే దాడి చేశామన్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పహాడిషరీఫ్‌ పోలీసులకు అప్పగించారు.

కల్తీ జాబితాలోకి సాస్, చాక్లెట్

కల్తీ జాబితాలోకి సాస్, చాక్లెట్


మరోవైపు పాతబస్తీలోని అసన్‌ బాబానగర్‌లో నిర్వహించిన కార్డెన్‌ సర్చ్‌లో పిల్లలు తినే చాక్లెట్ల తయారీలో నిషేధిత రసాయనాలు, కృత్రిమ పదార్థాలు వినియోగిస్తున్న పరిశ్రమ గుట్టును పాతబస్తీ పోలీసులు రట్టు చేశారు. పాతబస్తీలో ‘ఎస్‌ఏ ఫుడ్స్‌' పేరుతో నిర్వహిస్తున్న చాకెట్ల పరిశ్రమలో కల్తీ గుట్టును పోలీసులు రట్టుచేశారు.

కల్తీ జాబితాలోకి సాస్, చాక్లెట్

కల్తీ జాబితాలోకి సాస్, చాక్లెట్


పోలీసులు తెలిపిన కథనం ప్రకారం సయ్యద్‌ అహ్మద్‌ అనే వ్యక్తి ఈ చాక్లెట్ల పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. ఈ ఫ్యాక్టరీలో కచ్చా ఇమ్లి(టామరిండ్‌), కచ్చా ఆమ్‌ (పచ్చి మామిడికాయ) పేర్లతో చాక్లెట్లు తయారు చేస్తున్నాడు. వీటి తయారీకోసం సహజసిద్ధమైన చింతపండు, మామిడికాయలు ఉపయోగించకుండా అధికమోతాదులో నిషేధిత రసాయనాలు, కృత్రిమ పదార్థాలను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

 కల్తీ జాబితాలోకి సాస్, చాక్లెట్

కల్తీ జాబితాలోకి సాస్, చాక్లెట్


రోజుకు 100 నుంచి 500 కిలోల చాక్లెట్లు ఈ పరిశ్రమ నుంచి బేగంపేట హోల్‌సేల్‌ వ్యాపారులకు సరఫరా అవుతున్నాయి. ఈ పరిశ్రమలోని చాక్లెట్లు, ఒక బాటిల్‌ చాక్లెట్‌ ఫ్లేవర్‌, లాలిలాప్‌, టానా టన్‌ క్రీమీ సా్ట్రబెరి ఫ్లేవర్‌ ప్యాకెట్లు, రెండు ప్యాకెట్ల పిండి నమూనాలను పోలీసులు సేకరించారు.

 కల్తీ జాబితాలోకి సాస్, చాక్లెట్

కల్తీ జాబితాలోకి సాస్, చాక్లెట్

వీటిని ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులకు, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఈ మూడు సంస్థల నివేదిక ఆధారంగా ఈ పరిశ్రమపై చర్య తీసుకోనున్నారు. చాక్లెట్‌ పరిశ్రమ యజమాని మాత్రం చాక్లెట్ల తయారీకి తనకు అనుమతి ఉందని, అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే ఫార్ములాతో చాక్లెట్లు తయారుచేస్తాయని పోలీసులకు తెలిపారు.

English summary
Fake sauce bottles seized in old city, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X