హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ అపాయింట్‌మెంట్ లేదు: ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం(పిక్చర్స్)

పంజాగుట్ట‌లోని సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ముందు గురువారం ఓ కుటుంబం ఆత్మ హత్య యత్నానికి పాల్పడింది. తమ కష్టాలను సీఎంకి చెప్పి సాయం కోరేందుకు వచ్చిన వ్యక్తికి నాలుగు రోజులైన ఆయన అపాయింట్‌మెంట

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పంజాగుట్ట‌లోని సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ముందు గురువారం ఓ కుటుంబం ఆత్మ హత్య యత్నానికి పాల్పడింది. తమ కష్టాలను సీఎంకి చెప్పి సాయం కోరేందుకు వచ్చిన వ్యక్తికి నాలుగు రోజులైన ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో కూతురు, మేనల్లుడుతో కలిసి వచ్చిన సదరు వ్యక్తి సీఎం క్యాంప్ ఆఫీసు ఎదుటే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వారిని గాంధీ ఆస్పత్రి తరలించారు.

ఆర్థిక ఇబ్బందులు..

ఆర్థిక ఇబ్బందులు..

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా మోతె మండలం లాల్ తండాకు చెందిన బానోతు నాగార్జున(40)కు నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఐదేళ్ల క్రితం ఓ కుమారుడికి గుండెపోటు రావడంతో ఆపరేషన్ చేయించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల ఏర్పడటంతో పిల్లలకు చదువు చెప్పించడం నాగార్జునకు భారంగా మారింది.

తలకు మించిన భారం..

తలకు మించిన భారం..

కాగా, నాగార్జునకు ఇటీవల ఆరోగ్య సమస్య తలెత్తింది. పైగా మేనల్లుడా తెజావత్ శ్రీనివాస్(18)ను కూడా నాగార్జునే పోషిస్తున్నాడు. తనకున్న రెండెకరాలతో ఐదుగురి పోషణ, చదువులు, ఓ కొడుకు వైద్య ఖర్చులు తలకు మించిన భారం కావడంతో స్థానికుల సలహా మేరకు సీఎం కేసీఆర్‌ను సాయం కోరాలని నిర్ణయించుకున్నారు.

సీఎంను కలిసి..

సీఎంను కలిసి..

తన పిల్లలకు ఉచిత కేజీ టు పీజీ విద్య, కొడుకు వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం, తనకు ఉపాధి కల్పించాలని కోరాలని నాగార్జున భావించాడు. ఈ క్రమంలోనే కుమార్తె, మేనల్లుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చిన నాగార్జున.. నాలుగు రోజుల నుంచి సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించాడు. అయితే, అతని ప్రయత్నం విఫలమే అయ్యింది.

Recommended Video

Revanth Reddy Open Challenge to CM KCR
అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో..

అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో..

చివరి సారిగా గురువారం కూడా మేనల్లుడు శ్రీనివాస్, కూతురు నవ్య(13)తో కలిసి సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. ఇప్పుడు కూడా సీఎం అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారకస్థితిలో ముగ్గురూ కొట్టుమిట్టాడుతండగా గమనించిన క్యాంప్ కార్యాలయం సిబ్బంది వెంటనే వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

విషమంగానే నవ్య పరిస్థితి...

విషమంగానే నవ్య పరిస్థితి...

నాగార్జున, శ్రీనివాస్‌లకు ఏఎంసీలో, నవ్యకు చికిత్స అందిస్తున్నారు. పురుగుల మందు ప్రభావంతో వారికి అవయవాలు సక్రమంగా పని చేయడం లేదని వైద్యులు తెలిపారు. వీరిలో నవ్య పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన ఇద్దరికీ ప్రాణాపాయం లేదని గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నాగార్జున భార్య, మిగితా పిల్లలు కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. కాగా, ఆస్పత్రికి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు బాధితుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

English summary
Three people of a family attempted suicide at chief minister K Chandrasekhar Rao's camp office here on Thursday, for failing to get an appointment with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X