సునీతకు బిగ్ షాక్.. మాగంటి గోపినాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మరో ఐదు రోజుల్లో జరగనుంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "KTR వల్లే నా కొడుకు గోపీనాథ్ చనిపోయాడు.. సునీత పోటీపై నాకు సమాచారం లేదు. మనవడికి అన్యాయం చేయొద్దు..!" అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి కుటుంబ వివాదం బీఆర్‌ఎస్ ప్రచారానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారు పార్టీకి ఇది పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఎలక్షన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకు బిగ్ షాక్ తగిలింది. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి అభ్యంతరం తెలిపారు. ఇదే విషయంపై శేరిలింగంపల్లి తహసిల్దార్ చేపట్టిన విచారణలో ఆమె పాల్గొన్నారు. మరోవైపు సునీతపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాగంటి కుటుంబంలో కలహాల నేపథ్యంలో ఆ ప్రభావం ఎన్నికల్లో పడనుందని బీఆర్ఎస్ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.

ఇక మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం సునీత పోటీ చేస్తున్న విషయం కూడా తనకు తెలియదని వెల్లడించారు. సునీతకు తనతో కూడా మాటలు లేవన్నారు. అంతేకాక కేటీఆర్ వల్లే తన కుమారుడు చనిపోయాడని మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR వల్లే నా కొడుకు గోపీనాథ్ చనిపోయాడు
— oneindiatelugu (@oneindiatelugu) November 6, 2025
సునీత పోటీపై నాకు సమాచారం లేదు. మనవడికి అన్యాయం చేయొద్దు!
- గోపీనాథ్ తల్లి మహానందకుమారి సంచలన వ్యాఖ్యలు#MahaNandaKumari #MagantiGopinath #MagantiSunitha #PoliticsToday #Telangana #OITelugu pic.twitter.com/ZTWUjGzDur
తన మనవడికి అన్యాయం చేయొద్దని అన్నారు. తన మనవడు ప్రద్యుమ్న తారక్ కు తన తండ్రి వారసుడిగా అన్ని హక్కులకు అర్హుడని పేర్కొన్నారు. తాజాగా మాగంటి కుటుంబ వివాదం బీఆర్‌ఎస్ ప్రచారానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉండటంతో, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీకి పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications