మా నాన్న వడ్డీకిచ్చాడా, ఇప్పించండి: మంత్రులకు రైతు కొడుకు షాక్
హైదరాబాద్: తన తండ్రి లింబయ్య డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడైతే, ఆ డబ్బులు ఇప్పించాలని, వడ్డీ లేకపోయినా కనీసం అసలు ఇప్పిస్తే చాలని ఇటీవల రాజధానిలోని ట్యాంక్ బండు పైన ఆత్మహత్య చేసుకున్న లింబయ్య చిన్న కుమారుడు నవీన్ విజ్ఞప్తి చేశారు.
ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు లింబయ్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. దీంతో, లింబయ్య ఆరోగ్య కారణాల వల్ల చనిపోయాడని, ఆర్థిక ఇబ్బందులు లేవని, అప్పులు కూడా ఇచ్చేవాడని అధికార పార్టీ వర్గాలు చెప్పాయి.
దీంతో, లింబయ్య చిన్న కుమారుడు నవీన్ స్పందించారు. తన తండ్రి విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. తన తండ్రి ఆత్మహత్య పైన తప్పుడు నివేదికలు ఇచ్చిన వారంతా.. తన తండ్రి వడ్డీకి ఇచ్చారన్న చెబుతున్న డబ్బులు ఇప్పించాలన్నారు.

అప్పుల బాధతో తన తండ్రి చనిపోతే ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. గత సంవత్సరం పొలంలో దిగుబడి రాక చెరుకు పంట ఎండిపోయిందని, ఆర్థికంగా దిగజారి, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈసారి కొంత పొలాన్ని కౌలుకు ఇచ్చామని, మిగతా దాంట్లో సోయా, చెరుకు తోట సాగు చేసుకుంటున్నామన్నారు. ఆ పంటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు.
మంత్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి: రావుల
మరో టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి వేరుగా మాట్లాడుతూ... మానసిక వైద్యులతో రైతుల కన్నా ముందు మంత్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు.
రైతులు ప్రయివేటు వ్యాపారుల నుంచి తీసుకున్న అఫ్పుల వసూళ్ల పైన మారటోరియం విధించాలని, రుణమాఫీ నిధులన్నింటిని బ్యాంకులకు ఒకేసారి మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పథకం కింద నిధులను బ్యాంకులకు దశలవారీగా విడుదల చేయడం వల్ల రైతులకు కొత్త రుణాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications