అసెంబ్లీ ఎదుట పురుగుల మందు తాగిన రైతు సమ్మయ్య ఇతడే (ఫోటోలు)
హైదరాబాద్: అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరుగుతున్న సమయంలోనే శాసనసభ ఎదురుగా ఉన్న సెల్ టవరెక్కి యువరైతు ఒకరు ఆత్మహత్యాయత్నం చేయడం మంగళవారం సంచలనం రేకెత్తించింది. దీంతో 2 గంటలపాటు పోలీసులు, వాహనదారులు, ఆకాశవాణి కేంద్రం ఉద్యోగులు, మీడియా సిబ్బంది హైరానాపడ్డారు.
వరంగల్ జిల్లా చిన్న కొర్పొలు వాసి బొడ్డుపల్లి సమ్మయ్య (35)ది రైతు కుటుంబం. సోదరిపెళ్లి కోసం ఎకరం అమ్మగా.. 24 గుంటల పొలం మిగిలింది. రెండు లక్షలు అప్పుచేసి వరి, పత్తి సాగు ప్రారంభించాడు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. చేసిన అప్పు తీర్చలేని సమ్మయ్య రుణమాఫీ పథకంకోసం నెల రోజులపాటు సంబంధిత మంత్రిని, ముఖ్యమంత్రిని కలిసేందుకు చెప్పులరిగేలా తిరిగాడు.
విసిగి వేసారిపోయిన సమ్మయ్య మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ ఎదురుగా ఆలిండియా రేడియో స్టేషన్ పక్కనే గల సెల్‌టవర్ పైకి ఎక్కాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగుతూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పోలీసులకు తెలిపాడు.

అసెంబ్లీ ఎదుట పురుగుల మందు తాగిన రైతు సమ్మయ్య
దీంతో హుటాహుటిన సైఫాబాద్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని సమ్మయ్యను కిందకు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అసెంబ్లీ ఎదుట పురుగుల మందు తాగిన రైతు సమ్మయ్య
రుణమాఫీ కోసం మంత్రిని కలిసేందుకు నెల రోజులుగా ప్రయత్నిస్తున్నానని, అపాయింట్‌మెంట్ దొరకనందు ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు చెప్పడంతో సైఫాబాద్ అదనపు ఇన్‌స్పెక్టర్ ప్రకాశ్ రెడ్డి సిబ్బందితో వచ్చి సమ్మయ్యకు సర్దిచెప్పి నీ డిమాండ్లు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అసెంబ్లీ ఎదుట పురుగుల మందు తాగిన రైతు సమ్మయ్య
దీంతో పోలీసులు నానా బాధలూపడి 3.15 గంటల ప్రాంతంలో టవర్ పైనుంచి కిందకు దించారు. అప్పటికే పురుగుల మందుతాగివున్న సమ్మయ్య నోటి నుంచి నురగలు వస్తుండటంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

అసెంబ్లీ ఎదుట పురుగుల మందు తాగిన రైతు సమ్మయ్య
రైతు సమ్మయ్య తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో పాటలు రాసి ఉద్యమ బలోపేతానికి కృషి చేశాడు. నాడు తెలంగాణపై పాటలు రాసిన రైతు నేడు అప్పుల బాధతో ఆత్మహత్యకు పూనుకోవడం విచారకరమని సంఘటనాస్థలానికి వచ్చిన కొందరు కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications