ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్: ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులోని నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నిజామాబాద్‌కు చెందిన భ్రమరాంబిక దేవి (20) హిమాయత్‌నగర్‌లోని అశోక్‌బ్రిడ్జి సమీపంలోని హామ్స్‌టెక్ సంస్థలో గత రెండేళ్లుగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తూ, స్థానికంగా ఉన్న వీధి నెంబరు 13లోని ఓ హాస్టల్‌లో నివాసముంటోంది.

అయితే బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో హాస్టల్‌లో ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. స్థానికులు, హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు నారాయణగూడ పోలీసులు భ్రమరాంబికను మహేష్ ఆస్పత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.

Fashion designing student commits suicide

అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు జర్మన్‌లో ఉంటుండగా, భమ్రరాంబిక కూడా కోర్సు పూర్తయిన తర్వాత జర్మనీ వెళ్లాల్సి ఉందని ఆమె స్నేహితులు చెబుతున్నారు.

పోలీసుల విచారణలో మాత్రం ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. అయితే ఆమె మృతికి వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా? లేక ప్రేమ వ్యవహారమేమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+