శరవేగంగా సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణ.!వసతుల కల్పనలో సౌత్ లో టాప్.!

హైదరాబాద్: రైల్వే మంత్రిత్వ శాఖ నిర్దేశించిన "రైల్వే స్టేషన్ల యొక్క అప్‌గ్రేడేషన్"లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క అప్‌గ్రేడేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాత్కాలిక బుకింగ్ కార్యాలయం మరియు ఆర్ పి ఎఫ్ భవనానికి సంబంధించిన ప్రధాన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ అప్‌గ్రేడేషన్ పనులు దశలవారీగా చేపట్టి, ప్రతిపాదిత ప్రణాళిక మరియు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయనున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.

సర్వాంగ సుందరంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అప్‌గ్రేడేషన్‌ పనుల్లో భాగంగా భూసార పరీక్ష, టోపోగ్రాఫిక్‌ సర్వే పూర్తి చేసి తాత్కాలిక కార్యాలయాల నిర్మాణ పనులు చేపట్టారు. తాత్కాలిక బుకింగ్ కార్యాలయం కోసం పునాదులు వేయడం, నిలువు వరుసల ఏర్పాటు మరియు షెల్టర్ పనులు పూర్తయ్యాయి. ఫ్లోరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫాల్స్ సీలింగ్ పనులు కొనసాగుతున్నాయి. కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయము ఈ నెలలోనే ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Fast modernization of Secunderabad station.Top in the south in the creation of facilities.

ఈ నెలలో తాత్కాలిక బుకింగ్ కార్యాలయం పూర్తి: అదేవిధంగా కొత్తగా నిర్మించనున్న ఆర్‌పిఎఫ్ భవనానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పునాది, స్తంభాల నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తి కాగా, స్లాబ్ మరియు పార్టిషన్ కు సంబంధిత పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో కొత్త భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న స్టేషన్‌ భవనానికి దక్షిణం వైపున కొత్త స్టేషన్‌ భవనం కూడా అందుబాటులోకి తీసుకురానన్నారు అధికారులు. ఈ దిశలో వచ్చే ప్రయాణికులకు వసతి కల్పించేందుకు అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి, స్టేషన్ యొక్క దక్షిణ భాగంలో ఫౌండేషన్ కోసం తవ్వకం మరియు పునాది పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఎన్నో హంగులు.. అద్బుతంగా సికిందరాబాద్ ష్టేషన్: స్టేషన్ అప్‌గ్రేడేషన్ ప్లాన్‌లో భాగంగా 11 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల భూగర్భ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 9.5 లక్షల లీటర్ల భూగర్భ ట్యాంకులకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. దీనికి అనుగుణంగా ప్లాట్‌ఫాం 10, పీఆర్‌ఎస్ భవనంలో భూగర్భ ట్యాంకుల కోసం పీసీసీ బెడ్‌లు వేయడంతోపాటు తవ్వకం పనులు పూర్తయ్యాయి.

తదుపరి దశలో, రీఇన్ఫోర్స్మెంట్ కు సంబందించిన బార్ బైండింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. అదే సమయంలో, ఉత్తర దిశ బిల్డింగ్‌లోని కార్యాలయాల తరలింపు కూడా పురోగతిలో ఉంది. ప్రస్తుతానికి 60% యుటిలిటీల షిఫ్టింగ్ పూర్తయింది, మిగిలిన యుటిలిటీల బదిలీ పురోగతిలో ఉందని తెలుస్తోంది.

Fast modernization of Secunderabad station.Top in the south in the creation of facilities.

ప్రపంచ స్థాయి సౌకర్యాలు: ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ జంట నగరాల ప్రాంతంలోని ప్రధాన రైల్వే స్టేషన్ ఐన సికింద్రాబాద్ స్టేషన్‌ను విలక్షణమైన రూపాన్ని అందించడానికి మరియు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. దీనివల్ల స్టేషన్ కు క్రమంగా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ సమస్యను తగ్గించి, రాబోయే 40 సంవత్సరాల ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా ఉంటుందన్నారు.

దాదాపు 700 కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్‌ను అప్‌గ్రేడేషన్ పనులు చేపట్టడంతోపాటు ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయ్యేలా ప్రాజెక్ట్‌లోని ప్రతి దశను అధికారులు పర్యవేక్షిస్తున్నారని అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+