వరంగల్ లో మృత్యు శకటమైన ఇనుపరాడ్ల లారీ.. ఎంతమంది మృతి చెందారంటే!
రిపబ్లిక్ దినోత్సవం వేళ వరంగల్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా మామునూరు ప్రధాన రహదారి పైన ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది . ఇనుప స్తంభాలతో వెళుతున్న లారీ బోల్తా కొట్టడంతో అందులో ఉన్న ఇనుప రాడ్లు రెండు ఆటోల పైన పడ్డాయి.
ఇనుప స్తంభాల లోడు బోల్తా.. నలుగురు మృతి
ఓ కారు రోడ్డుపైన పడిన ఇనుప స్తంభాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇనుప స్తంభాల కింద పడి నలుగురు మృతి చెందారు. అయితే ఇనుప రాడ్ల కింద రెండు ఆటోలు ఉండడంతో ఈ ఘటనలో మొత్తం ఏడుగురు చనిపోయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇనుప రాడ్ల కింద ఉన్న ఆటోలను వెలికితీస్తే తప్ప అందులో ఇంకా ఎంతమంది ఉన్నారు అనే విషయం బయటకు రాదు.

మద్యం సేవించి లారీ నడిపిన డ్రైవర్
ఇనుప స్తంభాలను తొలగించి మృతులను వెలికి తీయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇనుప రాడ్లతో వెళుతున్న లారీ ఆటోను ఓవర్టేక్ చేయబోయి బోల్తా కొట్టినట్టు, దీంతో అందులో ఉన్న ఇనుప రాడ్లు ఆ రోడ్డుపై వెళ్తున్న ఆటోల పైన పడినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే లారీని నడిపిన డ్రైవర్ మద్యం సేవించి ఉండడం ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తుంది.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది
ఈ ఘటన పైన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినచోట సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. మృతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఇక గణతంత్ర దినోత్సవం రోజున ఊహించని విధంగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంతో చోటు చేసుకుంది.
ఇనుప స్తంభాలను తొలగించి ఆటలను వెలికి తీస్తున్న పోలీసులు
మామునూరు రోడ్డుపై జరగడంతో వరంగల్ ఖమ్మం రహదారి పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై అడ్డంగా పడిన ఇనుప స్తంభాలను ప్రస్తుతం జెసిబి ల సహాయంతో తొలగిస్తున్నారు. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త అని ఎంత చెప్పినప్పటికీ నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications