మౌనిక కన్నతండ్రే కిరాతకుడు: ఆషాఢానికి పుట్టింటికి తీసుకెళ్తూ రేప్, హత్య

Subscribe to Oneindia Telugu

కరీంనగర్‌: జిల్లాలోని మేడిపల్లి మండలం దేశాయిపేటలో దారుణం చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం పెళ్లయిన కన్న కూతురుపై తండ్రే అత్యాచారం చేసి హత్య చేశాడు. అంతకుముందు పోలీసులకు ఏవేవో కట్టకథలు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు ఘోరం వెలుగుచూసింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దేశాయిపేటకు చెందిన బూమల్ల నడ్పిమల్లయ్య తన కూతురు మౌనిక (19) వివాహం ఏప్రిల్‌లో మోత్కురావుపేటకు చెందిన మహేష్‌తో చేశాడు. ఆషాఢం వస్తుండటంతో శనివారం రాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై కూతురును తీసుకొస్తుండగా.. గోవిందారం శివారులో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మల్లయ్య వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అతనిపై దాడిచేసి మౌనికను అపహరించారని నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆదివారం ఉదయం నుంచి పోలీసులు గాలించగా మధ్యాహ్నం దేశాయిపేట శివారులో మౌనిక మృతదేహం లభించింది. మౌనిక ఒంటిపై ఆభరణాలు అలాగే ఉండటంతో దోపిడీ దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండకపోవచ్చని సీఐ కోరుట్ల సీఐ రాంచందర్‌ రాజు తెలిపారు.

Also Read: ట్విస్ట్: తండ్రే అమ్మాయిపై రేప్ చేసి, ఆమెను చంపేశాడు

నిందితులు అత్యాచారయత్నం చేసి చీరతో గొంతు నులిమి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

 A father allegedly killed his daughter

మౌనిక హత్య కేసులో కన్నతండ్రే నిందితుడు

మౌనిక కిడ్నాప్‌ వ్యవహారం మలుపు తిరిగింది. మౌనిక తండ్రే ద్విచక్రవాహనం తీసుకువస్తూ మార్గమధ్యంలో అత్యాచారయత్నం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించగా మల్లయ్య తన కుమార్తె చీర కొంగును గొంతుపై ఉంచి గట్టిగా లాగటంతో వూపిరాడక మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మల్లయ్య తన కుమార్తెను ఇద్దరు కిడ్నాప్‌ చేశారని కట్టుకథ అల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పలు రకాలుగా విచారణ జరిపిన పోలీసులు చివరికి మల్లయ్యను తమదైన శైలిలో విచారించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

పెళ్లికి ఎక్కువ కట్నం ఇవ్వాల్సి రావడంతో కూతురు మౌనికపై కోపం పెంచుకున్న మల్లయ్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచరాణలో వెల్లడించినట్లు సమాచారం. అంతేగాక, తన కుమార్తె తండ్రన్న గౌరవం తనకు ఇవ్వడం లేదని, అందువల్లే అత్యాచారం చేసి చంపానని పోలీసుల ముందు మల్లయ్య వెల్లడించినట్లు తెలిసింది. మీడియా ముందు ప్రవేశపెట్టిన సమయంలోనూ ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా మల్లయ్య కనిపించాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A father allegedly killed his daughter in Karimnagar district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి