Stray Dogs: బౌరంపేటలో దారుణం.. తండ్రీకొడుకులపై వీధి కుక్కల దాడి..
రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా బౌరంపేట్ లో తండ్రీకొడుకులపై వీధి కుక్కులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అక్టోబర్ 13 ఆదివారం రాత్రి పని మీద బయటకు వెళ్లిన కుమ్మరి మల్లయ్య తన కుమారుడిని తీసుకొని ఇంటికి వస్తుండగా వీధి కుక్కలు కరిచాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. నెల క్రితం ఇదే ఊరిలో ఓ బాలుడి పై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీధి కుక్కల దాడులు పెరగడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. గత సంవత్సరం అంబర్ పేటలో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు మృతి చెందాడు. దీంతో ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనంగా మారింది. వీధి కుక్కల దాడులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కరీంగనర్ లోని శాతవాహన యూనివర్సిటీ వద్దు ఓ వీధి కుక్క బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుక్క బాలుడిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సెప్టెంబర్ 9వ తేదీన నిజామాబాద్‌లోని బోదన్ నియోజకవర్గంలో 10 నెలల బాలుడిని వీధికుక్కలు కరిచి చంపాయి. అంతకు ముందు ఖాజీపేటలో కూడా బాలుడిని వీధి కుక్కలుపొట్టన పెట్టుకున్నాయి. సెప్టెంబర్ 9న ములుగు జిల్లా మంగపేట్ మండలం పోదుమూరు గ్రామంలో ఓ వృద్ధురాలితో సహా తొమ్మిది మంది వ్యక్తులపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డలో ఓ మహిళపై వీధి కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. అక్కడున్న వారు అడ్డుకోవడంతో ఆ మహిళ బయట పడింది.
ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత జూన్ లో మహబూబ్‌పేట్ బస్తీకి చెందిన సాత్విక్ అనే ఆరేళ్ల చిన్నారి పై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి చెందాడు. వీధి కుక్కల పెరగుకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వీధి కుక్కలు దాడులు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు.












Click it and Unblock the Notifications