ఏడాదిగా మైనర్ కవలలపై తండ్రి కొడుకుల అత్యాచారం: డబ్బుకోసం నోరు తెరవని తల్లి

రంగారెడ్డి జిల్లా :అభం భుభం తెలియని చిన్నారులు వారు. అలాంటి చిన్నారులపై ఇద్దరు మృగాళ్ళ కళ్ళు పడ్డాయి. తండ్రి కొడుకులు చిన్నారులపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. పట్టుమని పదేళ్ళు కూడ లేని ఆ చిన్నారులు భాదను దిగమింగుతున్నారు.డబ్బు కోసం ఈ అకృత్యానికి తల్లి సహాకరిస్తోంది. జబ్బుపడ్డ తండ్రి ఏం చేయాలేక నిస్సహాయుడిగా మారాడు.

స్కూల్, చదువుకోవడం, తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన పిల్లల్లో కొంత కాలంగా ఊహించని మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఈ మార్పులను గమనించిన పాఠశాళ ఉపాధ్యాయురాలు విధ్యార్థినులను ప్రశ్నించింది. దీంతో ఏడాది కాలంగా తాము అనుభవిస్తున్న నరకాలన్ని ఆ పిల్లలు బయటపెట్టారు.సభ్యపమాజం తలదించుకొనే ఈ ఘటన టీచర్ చొరవ వల్ల వెలుగుచూసింది.

తల్లిసహాకారంతో పిల్లలపై అత్యాచారం చేస్తోన్న నిందితులు

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవు పల్లి హాసన్ నగర్ లోని గుడిసెలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వీరు ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చి జీవనం సాగిస్తున్నారు.స్థానికంగా ఉన్న పాఠశాలకు పిల్లలను పంపుతున్నారు. ఈ దంపతులకు కవల పిల్లలు.వీరి 9 ఏళ్ళుంటాయి,. హఠాత్తుగా ఆ కుటుంబ యజమాని జబ్బుపడ్డాడు. ఈ జబ్బు ఆ పసిపిల్లల పాటిట శాపంగా మారింది.

father and his son rape minor twins from one year, with help of mother

ఆ కుటుంబ భారం భార్యపై పడింది. స్థానికంగా ఉన్న కంపెనీలో ఆమె పనికి కుదిరింది. అయితే కుటుంబ పోషణతో పాటు,భర్త కు మందుల ఖర్చుల కు ఆమెకు కష్టంగా మారింది. అదే క్రమంలో ఇక్కడే నివాసం ఉండే జాపర్ అనే వ్యక్తి అతని 16 ఏళ్ళ కొడుకు కన్ను మైనర్ బాలికలపై పడింది.
ఏడాదికాలంగా మైనర్ బాలికలపై తండ్రి కొడుకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు.ఈ దారుణానికి తల్లి సహాకరిస్తోంది. ఈ పాపపు పనికి తల్లి సహకరిస్తోంది. ఇందుకు ఆమెకు డబ్బులు ఇస్తున్నారు. ఈ ఘోరాన్ని చూసీ ఏం చేయలేని స్థితిలో మంచంలో అచేతనంగా తండ్రి పడి ఉన్నాడు. ఈ అవకాశాన్ని అదనుగా తీసుకొని వారు ఏడాదిగా మైనర్ కవలలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు.ఏడాదిగా మైనర్ బాలికలు శారీరకంగా బలహీనంగా మారడాన్ని గుర్తించిన టీచర్ బాలికలను ప్రశ్నించేసరికి విషయం వెలుగుచూసింది. బాలల పరిరక్షణ సమితి సహాకారంతో టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+