బాలికతో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు, తండ్రివల్లే..!
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఆజామాబాదులో ఉంటూ ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి తన కుమార్తెను ఉప్పల్‌లోని ఓ మహిళకు అఫ్పగించాడు. ఆమె కొందరు యువతులను వివిధ జిల్లాల నుండి రప్పించి వ్యభిచారం చేయిస్తోంది. ఇది తెలిసినప్పటికీ ఆ తండ్రి తన కుమార్తెను ఆమెకు అప్పగించాడు.
ఆ బాలిక పైన ఓ వ్యక్తి వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు అతడితో పాటు మహిళను, మరో విటుడిని, ఖమ్మం జిల్లాకు చెందిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధిత బాలిక చెప్పిన విషయం అందర్నీ ఖున్నుల్ని చేసింది. తన తండ్రే వ్యభిచారంలోకి బలవంతంగా దింపాడని ఆమె వివరించింది.
ప్రమాదశాత్తూ మహిళ మృతి

ఓ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికురాలు చీర యంత్రంలో చుట్టుకుపోవడంతో తలకు గాయమై మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సంతోష్‌పురానికి చెందిన ఎర్రయ్య భార్య జానకమ్మ(34) ముగ్గురు పిల్లలతో కలిసి జీవనోపాధి కోసం నగరానికి వచ్చి సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటోంది.
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్టిక్ చిప్స్ పరిశ్రమలో పని చేస్తోంది. శుక్రవారం విధి నిర్వహణలో యంత్రం వద్ద పని చేస్తూ చీర యంత్రంలో చుట్టుకుని తలకు బలమైన గాయమై మరణించింది.
రాత్రి తొమ్మిది దాటినా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంపెనీకి ఫోన్ చేయగా దెబ్బతగిలిందని ఆసుపత్రికి పంపామన్నారని వారు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని భర్త ఎర్రయ్య, ముగ్గురు పిల్లలు, బంధువులు కంపెనీ గేటు ముందు శనివారం ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications