ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హృదయ విదారకం: 65కిలోమీటర్లు బైక్ పై బాలిక మృతదేహం తరలింపు.. ఖమ్మంజిల్లాలో అమానవీయం!!

|
Google Oneindia TeluguNews

ఖమ్మం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒక గిరిజన బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. అంబులెన్స్ కు డబ్బులు కూడా లేకపోవడంతో, తల్లిదండ్రులు ఆ బాలిక మృతదేహాన్ని బైక్ పై తరలించిన ఘటన చోటు చేసుకుంది. 65 కిలోమీటర్ల మేర బాలిక మృతదేహాన్ని బైక్ పై తరలించిన ఘటన చూసిన వారందరిని కంటతడి పెట్టించింది.

మూడేళ్ళ గిరిజన బాలికకు అనారోగ్యం.. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలింపు

మూడేళ్ళ గిరిజన బాలికకు అనారోగ్యం.. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలింపు


ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామం లో ఆదివాసి కుటుంబానికి చెందిన వెట్టి మల్ల, ఆది దంపతుల కుమార్తె అయిన మూడు సంవత్సరాల బాలిక వెట్టి సుక్కి జ్వరంతో పాటు ఫిట్స్ రావడంతో ఆమెను ఏనుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన వైద్యులు వెంటనే పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు బాలికను ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాలిక మృతి .. అంబులెన్స్ లో బాలిక మృతదేహం తరలింపుకు వేడుకోలు

బాలిక మృతి .. అంబులెన్స్ లో బాలిక మృతదేహం తరలింపుకు వేడుకోలు


ఇక ఆసుపత్రిలో చేర్పించిన చిన్నారికి వైద్యం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివారం నాడు వైద్య చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు, బిడ్డ మృతదేహాన్ని అంబులెన్స్ లో తీసుకువెళ్లడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వారిని మరింత బాధ పెట్టింది. 65 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవలసి ఉన్నవారు బాలిక మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ పంపించాలని ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్నారు.

డబ్బులు లేక మృతదేహాన్ని బైక్ పై తరలించిన తల్లిదండ్రులు

అంబులెన్స్ పంపించడం కుదరదని, మృతదేహాన్ని మీరే తీసుకువెళ్లాలని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఇక అంబులెన్స్ లో తరలించడానికి, అంబులెన్స్ సిబ్బంది డబ్బులు ఖర్చవుతాయని చెప్పారు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేని సదరు తల్లిదండ్రులు, బాలిక మృతదేహాన్ని బంధువుల వద్ద బైక్ తీసుకుని తరలించడానికి నానా అగచాట్లు పడ్డారు. మరణించిన బాలిక మృతదేహాన్ని ఖమ్మం నుంచి కొత్త మేడేపల్లి గ్రామానికి బైక్ పై తరలించారు.

65 కిలోమీటర్ల దూరం బైక్ పై బాలిక తరలింపు.. అమానవీయ ఘటన

65 కిలోమీటర్ల దూరం బైక్ పై బాలిక తరలింపు.. అమానవీయ ఘటన


ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మానవత్వం చూపించక పోవడంతో, 65 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని తీసుకొని బాలిక తల్లిదండ్రులు బైక్ పై వెళ్లారు. బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ కుమార్తె మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గిరిజన కుటుంబమైన తమకు మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. దీంతో బైక్ పైనే మృతదేహాన్ని 65 కిలోమీటర్ల మేర తరలించి తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బాలిక మృతదేహాన్ని బైక్ పై తరలించిన హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

బీజేపీకి షాక్.. భవిష్యత్ ఎన్నికలపై మునుగోడు ఎఫెక్ట్; అంతర్మధనంలో బీజేపీ నేతలు!!బీజేపీకి షాక్.. భవిష్యత్ ఎన్నికలపై మునుగోడు ఎఫెక్ట్; అంతర్మధనంలో బీజేపీ నేతలు!!

English summary
The incident of moving the body of a tribal girl on a bike for 65 kilometers took place in Khammam distirct. As the hospital staff did not agree to move the girl's body in an ambulance, the parents moved the girl's body on a bike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X