తండ్రికి అంత్యక్రియలు చేసిన కూతుళ్లు...
హిందూ సంప్రదాయాల ప్రకారం తండ్రి మరణించినా, తల్లి మరణించినా, లేక కుటుంబంలో ఎవరు మరణించినా, కొడుకులు, ఇంట్లోని మగవారే తలకొరివి పెడతారు. ఇదే పద్ధతి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. కొడుకులు లేనివారు ఇంట్లో మగపిల్లలు లేని వారు దూరపు చుట్టాలైన అబ్బాయిలతోనైనా ఈ కార్యక్రమాలన్నీ పూర్తిచేస్తారు. కానీ, ఈ పద్ధతికి నలుగురు యువతులు చరమగీతం పాడారు. తండ్రి అనారోగ్యం కారణంగా మరణిస్తే నలుగురు కూతుళ్లు కొడుకులుగా మారి తండ్రి అంత్యక్రియలను పూర్తిచేశారు. ఈ విషాద సంఘటన మణుగూరు మండలం రాజుపేటలో చోటుచేసుకుంది.
అల్లారు ముద్దుగా పెంచిన కన్నతండ్రి దూరమైతే ఆ బాధ వర్ణానతీతం. అంతటి దుఃఖంలో ఆ నలుగురు కూతుళ్లు, తండ్రి అంతిమ సంస్కారంలో అన్ని తామై అన్ని కార్యక్రమాలను పూర్తిచేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.మణుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్ లో నరసింహారావు - గోపమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. వీరిలో ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. నరసింహరావు సింగరేణి విశ్రాంత ఉద్యోగి. ఆరుగురు పిల్లలని ఉన్నత చదువులు చదివించాడు నరసింహరావు. రెండేళ్ల క్రితం ఈతకు వెళ్లి కుమారుడు గోదావరిలో పడి చనిపోయాడు. అప్పటి నుండి అమ్మానాన్నలను ఆ కూతుర్లే చూసుకుంటున్నారు. ఇంటి బాధ్యత, తల్లిదండ్రుల భాద్యత అన్నీ వారేచూసుకుంటున్నారు.

తండ్రి పాడె మోస్తూ కన్నీరు పెట్టుకున్న కూతుళ్లు : అయితే, ఈ క్రమంలో వయసు పైబడిన నరసింహారావుకు నిన్నతెల్లవారుజామున గుండె నొప్పితో బాధ పడ్డారు. ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స సమయంలోనే నరసింహ రావు కన్నుమూసాడు. ఇంట్లో మగ వాళ్ళు ఎవరు లేకపోయే సరికి కూతుళ్లే తమ తండ్రీ అంత్యక్రియల ఏర్పాట్లను పూర్తిచేశారు. అయిదుగురు కూతుళ్లలో పెద్ద కూతురు తండ్రికి తలకొరివి పెట్టింది. ఇక, మిగిలిన నలుగురు కూతుళ్లు తండ్రి పాడే మోస్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికుల కళ్లు చెమర్చాయి.












Click it and Unblock the Notifications