వాళ్ళ చావులతో వణికిపోతున్న గ్రామం.. ఆ ఊర్లో ఏముంది?

శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లోనూ ఇంకా ఎన్నో చోట్ల దెయ్యాలు భూతాలు ఉన్నాయన్న భయం, ఊరికి ఏదో జరిగింది అన్న ఆందోళన తెలంగాణ రాష్ట్రంలోని ఓ గ్రామాన్ని వణికిస్తోంది. గ్రామంలో కొద్దిరోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఒక్కసారిగా ఊరు ఊరంతా భయాందోళనకు గురైంది.

భయం గుప్పిట్లో గ్రామం
ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఆ గ్రామస్తులు రాత్రివేళ ఇళ్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు. రాత్రివేళ ఒక ప్రాథమిక పాఠశాలలో తల దాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. అసలు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది? అక్కడ పరిస్థితి ఏమిటి? అన్నది వన్ ఇండియా ప్రత్యేక కథనంలో..

fear in asifabad samatalagundam village people night they leave village stay in govt school

సమతులగుండం గ్రామానికి పెద్ద కష్టమే
తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లాలో భయంతో గ్రామాన్ని ఆదివాసీలు విడిచి వెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమతులగుండం గ్రామానికి పెద్ద కష్టమే వచ్చింది. ఈ గ్రామానికి ఏదో జరిగిందని గ్రామస్తులు రాత్రయితే ఊర్లో ఉండడం లేదు. మౌలిక వసతులు లేని సమతల గుండం గ్రామానికి ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు, ప్రస్తుతం మరో కొత్త సమస్య వచ్చి పడింది.

గత నెలలో ఒకే కుటుంబంలో నలుగురు మృతితో భయం
ఈ గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం కూడా లేదు. మధ్యలో ఒక వాగు ఉండి, 8 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేసే తప్ప ఆ గ్రామానికి చేరుకోలేం. మొత్తం అక్కడ ఏడు కుటుంబాలు నివసిస్తున్నాయి. గత మార్చి నెలలో గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో నివాసం ఉంటున్న మిగతా కుటుంబాలకు భయం పట్టుకుంది.

Take a Poll

గ్రామంలో ఏదో ఉంది.. గ్రామస్తుల ఆందోళన
గ్రామానికి చెందిన 42 మంది గ్రామాన్ని వదిలి లింగాపూర్ మండలం భీమనుగొంది గ్రామంలోని పాఠశాలల ఆవరణలో తాత్కాలిక షెడ్లు వేసుకొని నివసిస్తున్నారు. సమతల గుండం వెళ్లాలంటే భయపడుతున్నారు.గ్రామంలో ఏదో ఉందని, ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని అందుకే రాత్రిపూట గ్రామంలో ఉండడం లేదని వారు చెబుతున్నారు. పగలంతా పొలం పనులు చేసుకుని వచ్చి పాఠశాల ఆవరణలో ఉంటున్నామని అంటున్నారు.

గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినా లాభం లేదు
వెంకటాపూర్ పంచాయతీ మాజీ సర్పంచ్ బాపురావు గత నెలలో గ్రామస్తులకు ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు, ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. అయితే గ్రామంలోని ఆదివాసీల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టడంతో పాటు మూఢనమ్మకాలను తొలగించేలా చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నం చేయాలని ఈ విషయం తెలిసిన పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+