హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుజూరాబాద్ బైపోల్ ఎఫెక్ట్: ఇంటర్ పస్టియర్ పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త తేదీలు ఇవే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నిక దృష్ట్యా ఇంటర్ మొదటి సంవత్సరం రెగ్యులర్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈమేరకు కొత్త తేదీలకు బోర్డు ప్రకటించింది. హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్‌తో పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు ఇంటర్​ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.
అక్టోబర్ 29, 30న జరగాల్సిన పరీక్షలు.. అక్టోబర్ 31, నవంబరు 1కి మార్చినట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు అక్టోబరు 25వ తేదీ నుంచి జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

కాగా, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మాస్కు లేకుండా పరీక్ష హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఎవరికైనా జలుబు, జ్వరం ఉంటే వారు పరీక్ష కేంద్రం ఇం‎ఛార్జీకి సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. ప్ర‌తి ఎగ్జామ్ సెంట‌ర్‌లో ఒక‌ట్రెండు ఐసోలేష‌న్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఏఎన్ఎం లేదా స్టాఫ్ న‌ర్సు అందుబాటులో ఉండ‌నున్నారు.

 few changes in inter first year exam schedule due to huzurabad by-poll

2020-21 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు.. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గత మార్చిలో కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే వారంతా ప్రమోట్‌ అయ్యారు. ప్రస్తుతం పరిస్థితులు మారడంతో మొదటి సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు గతంలోనే స్పష్టం చేసింది. తొలుత ప్రకటించిన విధంగా 70 శాతం సిలబస్​కే పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షల తేదీలు:
అక్టోబర్ 25 సెకండ్ లాగ్వేజ్-1,
26న ఇంగ్లీష్ పేపర్-1,
27న మాథ్య్-1, బాట్ని-1, పొలిటికల్ సైన్స్-1,
28న మాథ్య్-1, జూవాలజీ-1, హస్టరీ-1,
నవంబర్ 1న కెమిస్ట్రీ-1, కామర్స్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1,
2న మోడర్న్ లాగ్వేజ్ పేపర్-1, జియోగ్రాఫిక్ పేపర్-1,
31న ఫిజిక్స్-1, ఎకానమిక్స్-1 పరీక్ష నిర్వహించనున్నారు.

లాటరీ ద్వారా ఏకలవ్య మోడల్ స్కూల్స్‌ ప్రవేశాల ఎంపిక

ఖమ్మం రీజియన్ పరిధిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మిగిలిన సీట్లకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక ప్రక్రియ జరిగింది శుక్రవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఇందుకు సంబంధించిన కౌన్సిలింగ్, లాటరీ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్‌ను ఖమ్మం రీజియన్ కో-ఆర్డినేటర్ సీహెచ్ శ్రీనివాస్ రాయ్ ప్రారంభించారు. వివిధ పాఠశాలల్లో ఉన్న107 సీట్లను లాటరీ ద్వారా భర్తీ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం గిరిజన బాలికల ప్రిన్సిపాల్ మెండెం దేవదాసు, ఏకలవ్య మోడల్ పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్స్, వివిధ ప్రాంతాల నుంచి 200మంది విద్యార్థులు పాల్గొన్నారు.

English summary
few changes in inter first year exam schedule due to huzurabad by-poll
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X